Polena Anjana: ఇద్దరు కూతుర్లతో పవన్.. అంజని సొంత కూతురు కాదా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామా..!

Pawan Kalyan Daughter Anjana: పొద్దున నుంచి.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన ఇద్దరు కూతుర్లు తీసుకున్న ఫోటోనే కనిపిస్తోంది. వీరి ముగ్గురికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూతురు అంచనా గురించి మాత్రం కొన్ని అనుమానాలు నెటిజన్స్ లో మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కి మూడో భార్యతో.. దాదాపు రేణు దేశాయ్ కూతురు వయసు ఉండే అమ్మాయి ఎలా పుట్టింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కూతురు అంజన గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వినిపిస్తోంది. అదేమిటో చూద్దాం..

1 /6

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యింది అని,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనం సృష్టించింది.   

2 /6

ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు పంది కొవ్వు వాడారు అనే వార్త తెరపైకి రావడంతో హిందువులు ఈ విషయంపై మండిపడ్డారు కూడా. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి  డిప్యూటీ సీఎం గా పని చేస్తున్న ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే తమ ధ్యేయం అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 

3 /6

ఆ దీక్ష నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో కాలినడకన అలిపిరి మెట్ల ద్వారా స్వామివారిని చేరుకొని,  తన ఇద్దరు కూతుర్లతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఫోటోలు కాస్త బయటకు రావడంతో ఇద్దరు కూతుర్లు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా ఒకరు ఆధ్యా మనందరికీ తెలిసిన అమ్మాయి.. రేణు దేశాయ్ కూతురు. ఇంకొక అమ్మాయి అచ్చం ఆధ్యాలాగే ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

4 /6

ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా సంతానం అంటూ అందరూ కామెంట్లు కూడా చేశారు. కానీ ఇక్కడ విస్తుపోయే నిజం ఒకటి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

5 /6

రేణు దేశాయ్ నుంచి విడిపోయిన తర్వాత రష్యా కు చెందిన ప్రముఖ నటి అన్నా లెజినోవా ను మూడవ వివాహం చేసుకున్నారు పవన్. అయితే వీరి వివాహం జరిగి కేవలం 11 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న అమ్మాయి దాదాపు ఆధ్యా వయసుతో సమానంగా కనిపిస్తోంది. దీంతో ఈ అమ్మాయి ఎవరు..? నిజంగా పవన్ కళ్యాణ్ కూతురేనా లేక దత్త పుత్రికా..? అంటూ నెటిజన్స్ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

6 /6

అసలు విషయంలోకి వెళ్తే.. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ -  అన్నా లెజినోవా సంతానం కాదట. అన్నా లెజినోవా మొదటి భర్త కారణంగా జన్మించిన అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి తన తల్లి అంజనీ పేరు కలిసి వచ్చేలా పొలేనా అంజనీ పవనోవ అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంజనీ పవన్ కళ్యాణ్ సొంత కూతురు కాదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతులకు మార్క్ శంకర్ పవనోవిక్ అనే అబ్బాయి 2017లో జన్మించారు.