Poco C61 Price: పోకో నుంచి అదిరిపోయే మొబైల్‌.. మైండ్ బ్లాంక్‌ అయ్యే ఫీచర్స్‌!

Poco C61 Price: పోకో (Poco) తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Poco C61 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ పోకో (Poco) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే భారత మార్కెట్‌లో కొత్త బడ్జెట్ మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మొబైల్‌తో Poco C51 మోడల్‌తో లాంచ్‌ కాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మార్కెట్‌లో పాజిటీవ్‌ టాక్‌ వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /7

ఈ  Poco C61 స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్‌ లీక్‌ అయ్యింది. ఈ మొబైల్‌ ఫ్రాంట్‌ భాగంలో నోచ్డ్ డిస్‌ప్లేతో లభించబోతోంది. 

2 /7

అలాగే ఈ మొబైల్‌ బ్యాక్‌లో కూడా నాచ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది రెండు కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌తో అందుబాటులో ఉంది.  

3 /7

ఈ మొబైల్‌లోని ఎడమ వైపు ఉండే ఫ్రేమ్‌లో ట్రిపుల్ కార్డ్ స్లాట్ (2 SIM + 1 మైక్రో SD)ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పవర్‌ బటన్‌తో సెటప్‌తో అందుబాటులోకి ఉంది. దీంతో పాటు కింది భాగంలో USB-C పోర్ట్ మైక్రోఫోన్‌లు కూడా లభిస్తున్నాయి.   

4 /7

Poco C61 స్మార్ట్‌ఫోన్‌  Helio G36 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది 4GBర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6GBర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది.   

5 /7

దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.71-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫ్యూర్‌ LCD డిస్‌ప్లేతో రాబోతోంది. దీని స్క్రీన్‌ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో రాబోతోంది. దీంతో పాటు 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.    

6 /7

ఈ Poco C61 స్మార్ట్‌ఫోన్‌ త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇందులో 8MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలాగే  10W ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. 

7 /7

Poco C61 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లాంచింగ్‌ తేదిని ప్రకటించలేదు. కానీ 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ భారతదేశంలో రూ.7,499 ఉండబోతున్నట్లు తెలుస్తోంది.