PM Modi Europe Visit: ఐదుగురు మహిళ ప్రధానులతో పీఎం మోడీ

PM Modi Europe Visit: యూరప్ పర్యటనలో భాగంగా బుధవారం డెన్మార్క్లో రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఐస్లాండ్, ఫిన్ లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులను కలిశాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ నలుగురు ప్రధానమంత్రులు మహిళలు కావడం విశేషం.

 

  • May 05, 2022, 09:50 AM IST

PM Modi Europe Visit: నలుగురు ప్రధానమంత్రుల్లో ఐస్ లాండ్ పీఎం కార్టిన్ జకోబ్సడిటిర్, స్వీడన్ పీఎం మగ్దలెన అండర్సెన్, ఫిన్ లాండ్ పీఎం సన్నా మారిన్, డెన్మార్క్ పీఎం మెట్టె ఫ్రెడిర్క్ సన్ ఉన్నారు. వీరితో కరోనా తర్వాత ఆర్థిక పునరుద్ధరణ, ఎనర్జీరంగం, వాణిజ్య, ఇంధన, మౌలికరంగాల్లో, ద్వైపాక్షిక బలోపేతంపై ప్రధానమంత్రి మోదీ చర్చలు జరిపారు.

1 /4

 డెన్మార్క్ పీఎం మెట్టె ఫ్రెడిర్క్ సన్ తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు.

2 /4

ఫిన్ లాండ్ పీఎం సనా మారిన్ తో పెట్టుబడులు, వాణిజ్య, సాంకేతిక రంగాలపై ప్రధానమంత్రి మోదీ చర్చలు జరిపారు.

3 /4

మోదీ ఐస్ లాండ్ పీఎం కార్టిన్ జకోబ్సడిటిర్ పలు అంశాలపై చర్చించారు. వాణిజ్య, ఎనర్జీ, ఫిషరీస్ లాంటి రంగాల్లో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు.

4 /4

 మోదీ స్వీడన్ పీఎం మగ్దలెన అండర్సెన్ తోనూ సమావేశమయ్యారు. వీరిద్దరిమైన అద్భుతమైన చర్చ జరిగింది. ఈ ఇద్దరి మధ్య మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. భద్రతా, ఐటీ అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అంశాలపై డిస్కస్ చేశారు.