Petrol Diesel Price: వాహనదారులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్..!

Petrol And Diesel Price Today: వాహనదారులకు గుడ్‌న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ హింట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ రేట్లు పొడిగించిన కాలం తగ్గితే.. ప్రభుత్వ-ఆధారిత ఇంధన కంపెనీలు ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉంటే.. చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించడాన్ని పరిశీలిస్తాయన్నారు.
 

1 /7

ఇటీవల ఆయిల్ ధరలు దాదాపు మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఇంధన మార్కెటింగ్ కంపెనీల లాభదాయకతను పెంచడం, పంపు ధరల తగ్గింపునకు మార్గం సుగమం అయింది.  

2 /7

డిసెంబర్ 2021 తర్వాత మొదటిసారిగా మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ చమురు ధర 70 డాలర్ల దిగువకు పడిపోయింది.   

3 /7

క్రూడ్ ధరలు తగ్గడంతో చమురు ఉత్పత్తిని తగ్గించే యోచనలో  ఒపెక్‌+ దేశాలు ఉండగా.. ఉత్పత్తి పెంచాలని భారత్ కోరుతోంది.  

4 /7

రష్యన్ ఆయిల్ తక్కువ ధరకే లభిస్తున్న తరుణంలో ఎక్కువగా దిగుమతి చేసేందుకు ఆయిల్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయని పంకజ్ జైన్ తెలిపారు.     

5 /7

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించింది. లీటర్‌కు 2 రూపాయలు తగ్గించింది.   

6 /7

త్వరలోనే జమ్ము-కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

7 /7

ఫ్యూచర్స్ ట్రేడ్‌లో గురువారం ముడి చమురు ధరలు బ్యారెల్‌కు రూ.51 పెరిగి రూ.5,709కి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో అక్టోబర్ డెలివరీకి ముడి చమురు 11,306 లాట్లలో బ్యారెల్‌కు రూ.51 లేదా 0.9 శాతం పెరిగి ₹ 5,709 వద్ద ట్రేడవుతోంది.