Saree Business Ideas:మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఉందా మీ ఖాళీ సమయం కేటాయించి ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
Saree Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉండి మంచి వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా.? ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు మీ ఇంట్లో పెరుగుతున్న ఖర్చులకు చన్నీళ్ళకు వేడి నీళ్లలా సహాయం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మీరు ఇంటి వద్ద ఉండి మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.
అంతేకాదు ఈ బిజినెస్ లో మీరు పెద్ద మొత్తంలో లాభం పొందవచ్చు. సీజన్లో ఈ బిజినెస్ కనుక నడిస్తే మీకు పెద్ద ఎత్తున లాభం వస్తుంది. మీ పెట్టుబడి పైన కచ్చితంగా 100% లాభం లభించే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వివాహ మహోత్సవాల్లో కంచి పట్టుచీరలకు ఉన్న డిమాండ్ మరే డిమాండ్ చీరకు ఉండదు. చక్కటి మన్నికైన నాణ్యమైన కంచి పట్టుచీరలు కావాలంటే కంచి పట్టుచీరలే కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కంచి పట్టుచీరల ధరలు సుమారు పదివేల రూపాయల నుంచి ప్రారంభిస్తే లక్షల రూపాయల వరకు ఉంటాయి.
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల చీరలు కట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఇంత డిమాండ్ ఉన్న కంచి పట్టు చీరలను మీరు స్థానికంగా ఉండే షోరూంలో నుంచి కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు తమిళనాడులోని కాంచీపురం వెళ్లి అక్కడ నేరుగా నేత కార్మికుల వద్ద చీరలను హోల్ సేల్ ధరలో కొనుగోలు చేసినట్లయితే.. చాలా తక్కువ ధరకే నాణ్యమైన మన్నికైన కంచి పట్టుచీరలు కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తుంది.
ఈ చీరలను మీరు స్థానికంగా ఇంట్లోనే అమ్ముకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మంచి లాభం లభిస్తుంది. నాణ్యమైన కంచి పట్టుచీరలు మీరు కంచి వెళ్లి షాపింగ్ చేసి విక్రయించినట్లయితే షో రూమ్ కన్నా తక్కువ ధరకే అమ్మవచ్చు. అలాంటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఈ చీరలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
ముఖ్యంగా శ్రావణమాసం, మాఘ మాసం, ఆశ్వీయుజం అలాగే కార్తీకమాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ నెలలో కంచి పట్టుచీరలకు మంచి డిమాండ్ లభిస్తుంది. మీరు మంచి డిజైనర్ మోడరన్ కంచి పట్టుచీరలను అందుబాటులో ఉంచినట్లయితే మీకు చక్కటి లాభం లభించే అవకాశం ఉంది.
ఉదాహరణకు కంచిపురంలో 5000 రూపాయలకు లభించే కంచి పట్టుచీర షో రూమ్లో 25 వేల రూపాయలకు విక్రయిస్తారు. ఇదే చీర పైన మీరు కాస్త లాభం మార్జిన్ తగ్గించుకొని పదివేల నుంచి 15 వేల రూపాయలకు అమ్మినట్లయితే ఎక్కువ మంది కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.ఇలా చూసినట్లయితే మీరు పెట్టే పెట్టుబడి పైన దాదాపు రెండింతలు లాభం మీరు పొందే అవకాశం లభిస్తుంది.