Nidhhi Agerwal: పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు 'చంపేస్తాం' అంటూ వేధింపులు.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

Nidhhi Agerwal Lodged Cybercrime Case Against Threats: డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌కు సైబర్‌ వేధింపులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై హీరోయిన్‌ పోలీసులను ఆశ్రయించింది. తెలంగాణ సైబర్‌ పోలీసులకు నిధి అగర్వాల్‌ ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.

1 /6

ప్రముఖ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌కు సామాజిక మాధ్యమాల్లో వేధింపులు జరుగుతున్నాయి. ఏకంగా చంపుతాం అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

2 /6

ఈ బెదిరింపులతో నిధి అగర్వాల్‌తోపాటు ఆమె కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భయాందోళన చెందుతున్నారు.

3 /6

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వ్యక్తి అసభ్య పదజాలంతో వేధించడమే కాకుండా హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

4 /6

ఒక ఆగంతకుడు తనను వేధిస్తున్నాడని.. అతడి వేధింపులతో తమ కుటుంబంతోపాటు తాను మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వాపోయింది.

5 /6

అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిధి అగర్వాల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామెంట్స్‌ కూడా దారుణంగా చేస్తున్నాడని తెలిపింది.

6 /6

ఇస్మార్ట్‌ శంకర్‌తో బంపర్‌ హిట్‌ పొందిన నిధి అగర్వాల్‌ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు', 'ది రాజా సాబ్‌' సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.