What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు.
Nps Vatsalya Scheme: NPS-వాత్సల్య పథకం తల్లిదండ్రులు వారి పిల్లల పేరిట డబ్బును డిపాజిట్ చేసే పథకం. ఈ పథకం కింద, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కనీసం రూ. 1000తో తమ పిల్లల పేరిట ఎన్‌పిఎస్-వాత్సల్య ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీంలో గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఎన్‌పిఎస్-వాత్సల్య ఖాతాలో ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేయవచ్చు.
NPS వాత్సల్య పథకం భారతదేశంలోని పెన్షన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన దశ. పిల్లల ఆర్థిక భవిష్యత్తును కాపాడేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. NPS వాత్సల్య స్కీమ్ నిర్వహణ పని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చేతిలో ఉంటుంది. ఎన్‌పిఎస్ వాత్సల్య పథకం తల్లిదండ్రులు,వారి సంరక్షకులు పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పిల్లల భవిష్యత్తును ఆదా చేయడానికి, నిధులు సమకూర్చేందుకు అనుమతి ఇస్తుంది.
ఎవరు అర్హులు: భారతీయ పౌరులు, ఎన్ఆర్ఐలు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు
NPS వాత్సల్య రూల్స్ ఇవే: పిల్లలకి 18 ఏళ్లు వచ్చేలోపు మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.18 సంవత్సరాలు నిండిన సభ్యులు అంటే పెద్దలు వారు కోరుకుంటే ఎన్‌పిఎస్ ఖాతాను సాధారణ ఖాతా మార్చి కొనసాగించవచ్చు .18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత, పెద్దలు 3 నెలల్లోపు కొత్తగా KYCని పొందవలసి ఉంటుంది.
అవసరం అయితే 18 ఏళ్ల తర్వాత NPS వాత్సల్య ఖాతాను కూడా మూసివేయవచ్చు. నిర్దిష్ట వ్యాధుల చికిత్స, 75% కంటే ఎక్కువ వైకల్యం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పేర్కొన్న విద్య వంటి కేసులకు పాక్షిక విత్ డ్రాయల్ చేయవచ్చు.
ముఖ్యమైన నిబంధనలు ఇవే: ఎన్‌పిఎస్ వాత్సల్య పథకం కింద, ఖాతాను తెరిచిన తర్వాత పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు, ఖాతాలో జమ చేసిన కార్పస్‌లో 60% విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40% పదవీ విరమణపై యాన్యుటీ స్కీంలో పెట్టుబడి పెట్టాలి. వృద్ధాప్యంలో యాన్యుటీ ద్వారా నెలవారీ పింఛను అందిస్తుంది. మరణం సంభవిస్తే డిపాజిట్ చేసిన మొత్తం మొత్తం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు తిరిగి ఇస్తారు.NPS వాత్సల్య ఖాతాలో నామినీగా అనుబంధించబడిన తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని పొందుతారు.
సంరక్షకుడు మరణించిన సందర్భంలో, కొత్త KYC ద్వారా మరొక వ్యక్తిని సంరక్షకుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు అంటే తల్లి తండ్రి ఇద్దరూ మరణించిన సందర్భంలో, NPS వాత్సల్య పథకంతో అనుబంధించబడిన పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చట్టపరమైన సంరక్షకుడు వార్షిక సహకారం చెల్లించకుండానే ఉండవచ్చు.