లెజెండరీ లతా మంగేష్కర్ ఇక లేరు. పాటలతో మంత్రముగ్దుల్ని చేసిన స్వర కోకిల అందర్నీ విడిచి వెళ్లిపోయారు. 35 ప్రాంతీయ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ కెరీర్‌లో టాప్ 10 బ్యూటిఫుల్ మెలోడీస్‌గా, బెస్ట్ సాంగ్స్‌గా ఉన్న పాటలేంటో చూద్దాం.
Lata Top Songs: లెజెండరీ లతా మంగేష్కర్ ఇక లేరు. పాటలతో మంత్రముగ్దుల్ని చేసిన స్వర కోకిల అందర్నీ విడిచి వెళ్లిపోయారు. 35 ప్రాంతీయ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ కెరీర్‌లో టాప్ 10 బ్యూటిఫుల్ మెలోడీస్‌గా, బెస్ట్ సాంగ్స్‌గా ఉన్న పాటలేంటో చూద్దాం.
ఇక షారుఖ్ ఖాన్, కాజల్ నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో తుఝే దేఖాతో పాట ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది.
యాష్ చోప్రా నిర్మించిన వీర్‌జారా సినిమాలో తేరే లియే పాట మరో అద్భుతం. శ్రావ్యమైన కంఠంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ఈ పాట
లతా మంగేష్కర్ పాడిన పాటల్లో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ పాటగా నిలిచేది మాత్రం లగ్‌జా గలే సే...వో కౌన్ థీ సినిమాలో పాట ఇప్పటికీ హత్తుకుంటూనే ఉంటుంది.
ఇక రాజేష్ ఖన్నా నటించిన ఆరాధన సినిమాలో పాట అయితే ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. కోరా కాగజ్ థా మన్ మేరా అంటూ మనస్సును హత్తుకుంటుంది ఈ పాట
ఇక షారుఖ్ ఖాన్ మరో సినిమా దిల్‌సేలో జియా జలే పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇప్పటికే మధురమైన రొమాంటిక్ పాటగా నిలుస్తోంది.
ఇక లతా పాడిన మరో అద్భుతమైన రొమాంటిక్ పాట..హోటోం పే ఐసీ బాత్ దబాకే.. పాట ట్యూన్ గానీ.. ఆమె గొంతు గానీ ఎప్పటికీ మర్చిపోలేం.
ఇక మరో అద్భుతమైన లవ్ సాంగ్...అజీబ్ దాస్తాన్ ఎప్పటికీ మరుగున పడని పాట ఇది
మాలా సిన్హా, ధర్మేంద్ర నటీనటులుగా ఉన్న అన్‌పఢ్ సినిమాలో పాట..ఆప్ కీ నజ్రోం నే పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు.
లతా మంగేష్కర్ పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చేది అయ్ మేరే వతన్‌కే లోగో పాట. నెహ్రూకు సైతం కంటనీరు తెప్పించిన పాట ఇది. ప్రదీప్ కుమార్ రాసిన ఈ పాటను 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళిగా పాడారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇవాళ అంటే ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 గంటల 12 నిమిషాలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా జీవితంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు చేరాయి. సినీ పరిశ్రమలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచారు.