Neha Shetty: చీరకట్టులో పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ లేటెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ఫిదా..

Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు కన్నడ భామ అయిన  తెలుగులో డీజే టిల్లు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో పరిచయంది. ఇక డీజే టిల్లు మూవీతో  ఓవర్ నైట్ పాపులర్ అయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే చిత్రాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.

1 /6

నేహా శెట్టి.. కన్నడ చిత్రసీమలో  'ముంగారు మేల్ 2' మూవీతో కథానాయిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ తో ఓ మోస్తరుగా నడిచింది.  

2 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నేహా శెట్టి.    

3 /6

మంగళూరు బ్యూటీ అయిన నేహా ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాలో నటించింది. అటు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్న క్యారెక్టర్ లో నటించి మెచ్చుకుంది. .

4 /6

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పుల్లుగా ఫేమస్ అయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ నేహా శెట్టిని పలకరించాయి. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో నేహా శెట్టి  కాసేపు అలా పలకరించింది.

5 /6

లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది.  సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది.

6 /6

తాజాగా నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటించింది. ఈ సినిమా  ఓ మోస్తరు విజయం సాధించింది.