Jammi chettu and Palapitta: దేశంలో ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కూడా దసరా నవరాత్రుల్ని వైభవంగా జరుపుకుంటారు. దుర్గమ్మ వారు తొమ్మిది రూపాల్లో కూడా భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
ప్రతి ఏడాది కూడా అశ్వయుజ మాసంలో దసర శరన్నవ రాత్రుల పూజల్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు, తొమ్మిది అవతారాలలో దర్శనమిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. దసరా పండగను 12 వ తేదీ శనివారం రోజున జరుపుకోనున్నారు.
అయితే.. దసరా రోజున అనాదీగా దుర్గమ్మను ఎంతో భక్తితో కొలుచుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా దుర్గమ్మ తల్లిని పూజించుకుని ప్రజలంతా జమ్మి చెట్టును దర్శనం చేసుకుని పూజలు చేస్తుంటారు.
మరికొందరు పాలపిట్ట కన్పిస్తే ఎంతో లక్కీగా భావిస్తారు. దసరా రోజున కనుక పాలపిట్ట కన్పిస్తే.. వారి జీవితంలో ఏదో గొప్ప అనుభూతి కల్గుతుందని కూడా పండితులు చెబుతుంటారు. శమి చెట్టునే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక దేవతా వృక్షంగా చెప్తుంటారు
కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహాప్రవేశాల సమయంలో కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. దుర్గమ్మ వారు.. 9 రోజులు పాటు రాక్షసులతో వివిధ రూపాల్లో పోరాడి గెలిచిన సందర్భంగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాల్లో కొలుస్తారు. ఇలాంటి ఎంతో ముఖ్యమైన ఈ పండుగలో జమ్మి చెట్టుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది.
ఈ జమ్మిచెట్టు గురించి పురాణాల్లో కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత.. అజ్ఙాత వాసంకు వెళ్లేముందు ఈ జమ్మిచెట్టును దర్శనం చేసుకుంటారు. వారి ఆయుధాలను ఈ చెట్టుమీద కొమ్మల మధ్యలో దాడిపెడతారు.
అదే విధంగా.. అజ్ఙాతవాసం పూర్తి కాగానే వాటిని జమ్మి చెట్టు పై నుంచి కిందకి తీసుకుని చెట్టును అపరాజిత దేవి రూపంగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీస్సులతో పాండవులకు విజయాలు సాధించారంటా. అదే విధంగా శ్రీ రాముడు కూడా.. త్రేతా యుగంలో శ్రీరాముడు కూడా రావణునితో యుద్దానికి వెళ్లే ముందు శమీ వృక్షానికి పూజించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. దసరా పండుగ సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనీ.. అర్జునస్య ధనుర్ధారీ.. రామస్య ప్రియదర్శనం.. అనే శ్లోకాన్ని చదువుతూ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మరో కథలో.. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు శమీ వృక్షం కూడా ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే ఓ నమ్మకం కూడా ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని తిరిగి వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందని చెప్తుంటారు. అందుకే వారు యుద్దం లో విజయం సాధించారని అంతే కాకుండా అప్పటి నుంచి కూడా వారు అన్నింట్లోనూ విజయం సాధించారని కూడా కొన్ని పురాణాల్లో కథలు ఉన్నాయి. అందుకే పాలపిట్టను విజయ దశమి నాడు చూడటం చాలా శుభసూచకంగా, మంచిదని కూడా చెప్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)