6 auspicious coincidence on narendra modi swearing: రేపే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడవసారి ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎన్డీఏ సమావేశంలో లోకసభలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, ఆదివారం జూన్ 9 ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్న జూన్ 9న రవి యోగం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మోడీ ప్రమాణస్వీకారం విజయానికి ప్రతీక, దోషాలు తొలగిపోతాయి రవి యోగం విజయానికి ప్రతీకగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు.
ఆదివారం పుష్యా నక్షత్రం సందర్భంగా ఈ రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ పనులు చేసిన విజయం తప్పదు. ముఖ్యంగా యోగంలో బృహస్పతి సూర్యుడి ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఈ రెండు సక్కెస్, శక్తి, మేధస్సుకు ప్రతీక
ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధి యోగం కూడా కొనసాగుతుంది ఈ వృద్ధి యోగం సమయంలో ఏ పనులు చేసిన మెరుగైన ఫలితాలు లభిస్తాయి. పెరుగుతూనే ఉంటాయి. ఏ అడ్డంకులు లేకుండా ముందుకు కొనసాగుతారు.
ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోయే జూన్ 9 జ్యేష్ట మాసం తృతీయ తిథి. కాబట్టి ఈ తిధి కూడా అభివృద్ధికి సూచికగా భావిస్తారు.
అంతేకాదు జూన్ 10 రాత్రి 8:20 నుంచి ఆ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు సర్వార్ధ సిద్ది యోగం చెల్లుతుంది ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది.
ఈ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే శుభప్రదం అయిందిగా పరిగణిస్తారు ముఖ్యంగా ఈరోజు పునర్వ పునర్వసు నక్షత్రంలో కొత్త పనులు ప్రారంభించడానికి మంచిది అని జ్యోతిష్యులు చెబుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)