Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అందులో 'హలో బ్రదర్' చిత్రానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ఈ మూవీలో నాగార్జున.. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు నాగ్ లు కనిపించే సీన్స్ ఉన్నాయి. ఆ సమయంలో నాగార్జునకు ఓ స్టార్ హీరో డూప్‌గా నటించారు.
Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తండ్రి తగ్గ తనయుడిగా పేరు గడించాడు. అంతేకాదు తండ్రిలా క్లాస్ హీరోగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే.. మాస్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ్ కెరీర్లో ఎన్నో డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. అందులో మజ్ను, గీతాంజలి, శివ, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి మూవీస్ ఉన్నాయి.
ఇందులో నాగార్జున హీరోగా నటించిన 'హలో బ్రదర్' చిత్రంలో ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేసారు. ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించారు. ఈ సినిమాకు కోటీ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అంతేకాదు ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'హలో బ్రదర్' మూవీని ఎన్టీఆర్ 'రాముడు భీముడు' తరహాలో ఒక క్యారెక్టర్ అమాయకుడు అయితే.. మరో పాత్ర గడుసుతనం నిండిన పాత్ర.
‘హలో బ్రదర్' మూవీలో నాగార్జున రెండు డిఫరెంట్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమాల నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో నాగార్జున డూప్‌గా హీరో శ్రీకాంత్ యాక్ట్ చేసినట్టు అప్పట్లో బిగ్‌బాస్ షో ఫినాలేలో సీక్రెట్ రివీల్ చేశారు.
ఇక హీరో శ్రీకాంత్‌కు ఇవివితో మంచి ర్యాపో ఉంది. అంతకు ముందు శ్రీకాంత్.. నాగ్ హీరోగా నటించిన 'వారసుడు'లో విలన్‌గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం','నిన్నే ప్రేమిస్తా' చిత్రాల్లో కలిసి నటించారు.
ఇంకోవైపు శ్రీకాంత్, నాగార్జున దాదాపు ఒకే ఎత్తు, పర్సనాలిటీ ఉండటంతో ఇద్దరు నాగార్జునలు కనిపించే సన్నివేశాల్లో శ్రీకాంత్ డూప్‌గా యాక్ట్ చేశారు. ఇక నాగార్జున.. హలో బ్రదర్ మూవీ తర్వాత 'ఎదురులేని మనిషి', సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించారు.
హలో బ్రదర్‌లో కవల సోదురులుగా యాక్ట్ చేశారు నాగార్జున. అటు ఎదురులేని మనిషి.. ఏజ్ గ్యాప్ ఉన్న అన్నదమ్ముల పాత్రలో నటించారు. ఇక 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' సినిమాల్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. నాగార్జున.. రీసెంట్గా 'నా సామి రంగ' సినిమాతో పలకరించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.