Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలోకి విగ్రహాంను ఇటీవల ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేశాడు.ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో హిందుసంఘాలన్ని దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే సలీంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ లో ఈరోజు (శనివారం) బంద్ కు పిలుపునిచ్చారు.
ఇటీవల లేడీ నాగ సాధు ముత్యాలమ్మ ఆలయంకు వచ్చారు. అక్కడ అమ్మవారి ముందు ఒక కాలిపై నిలబడి ప్రత్యేకంగా పూజలు సైతం చేశారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలీదు.
ఒంటి నిండా బూడిద, పుర్రెల మాలలు, దిగంబరంగా ఉండటం కన్పిస్తుంది. ముఖ్యంగా అఘోరీ మాత మాట్లాడుతూ.. ఇతర మతాలను గౌరవిస్తునే సనాతన ధర్మంను కాపాడుకొవాలన్నారు. అంతేకాకుండా..ప్రతి ఒక్కరు ఇలాంటి ఘటనపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే.. తాను.. ఏడేళ్ల వయస్సులో కాశీకి వెళ్లి అఘోరీగా మారానని చెప్పుకొచ్చారు. ఏన్నోఏళ్లు కఠోరంగా ఉన్న తర్వాత నాగసాధులుగా, అఘోరీలుగా మారతారని చెప్పింది. శవాల మధ్యన ఉంటూ, శవాలను తింటామని చెప్పింది. ఇప్పటి దాక వెయ్యికి పైగా శవాలు తిన్నట్లు చెప్పారు.
తనకు తానుగా.. 20 ఏళ్ల క్రితమే పిండ ప్రదానం కూడా చేసుకున్నట్లు చెప్పారు. తమకు ఎవరి మీద వ్యామోహం ఉండదని కూడా చెప్పుకొచ్చారు. కేవలం శివనామస్మరణం మాత్రమే నిరంతరం చేస్తు ఉంటామని చెప్పుకొచ్చారు.
అయితే.. పీరియడ్స్ అఘోరీలకు వస్తాయా.. అని కొంత మంది ప్రశ్నించగా.. అందరి మహిళల మాదిరిగానే పీరియడ్స్ వస్తాయని లేడీ అఘోరీ చెప్పారు. ఆ సమయంలో కూడా బూడిద పూసుకుని స్మశానంలో ఉంటామని చెప్పుకొవచ్చారు.ఆ ఐదు రోజులు మాత్రం పూజలకు దూరంగా ఉంటామని కూడా లేడీ అఘోరీ చెప్పుకొచ్చింది.
తన గురువు కాశీ విశ్వనాత్ ఆధ్వర్యంలో తాను.. అఘోరీగా మారినట్లు వెల్లడించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మీద డెంజర్ లేడీస్ డేంజన్ అని కూడా రాసి పెట్టిఉంది. దానిలో పుర్రెలున్నాయి. అఘోరీ మాత కారుకు చెందిన వీడియో కూడా వార్తలలో నిలిచింది.