Mukesh Ambani House: ముఖేష్‌ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!

Mukesh Ambani House Inside Pics and Price: ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యధిక ఆస్తుల కలిగిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.9,48,860 కోట్లు ఉంటుంది. ముఖేష్ అంబానీ వ్యాపారాలే కాకుండా ఆయన ఇల్లు కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఈ ఇంటికి ఆంటిలియా అని నామకరణం చేశారు. ఈ ఇంటి ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

ఆంటిలియాను అంబానీ టవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఐకానిక్ బిల్డింగ్ లోపల ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంటుంది. సకల సౌకర్యాలతో ఆంటిలియాను నిర్మించారు. 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 570 అడుగుల అద్భుతమైన ఎత్తుతో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి.  

2 /7

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్, పృథ్వీ అంబానీ, వేదా అంబానీ కుటుంబం అంతా ఇక్కడే ఉంటారు. ఆంటిలియా పేరు వెనుక కూడా ఓ చరిత్ర ఉంది.  

3 /7

15వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చిన ఒక పౌరాణిక ద్వీపం 'ఆంటె-ల్లా' పేరు పెట్టారు. ఈ భవనం నిర్మాణం 2006లో ఆస్ట్రేలియాకు చెందిన లైటన్ ఆసియా కంపెనీ చేపట్టింది. 2010లో BE బిల్లిమోరియా & కంపెనీ లిమిటెడ్‌ కంపెనీ పూర్తి చేసింది. చికాగోకు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ & విల్, ఇంటీరియర్ డిజైన్ నిపుణులు హిర్ష్ బెడ్నర్ అసోసియేట్స్ డిజైన్స్ తయారు చేశారు.  

4 /7

ఈ భవనంలో 49 విలావంతమైన బెడ్‌రూమ్‌లు, 168 కార్ల పార్కింగ్ స్పెస్, బాల్‌రూమ్, 50 సీట్ల థియేటర్, హ్యాంగింగ్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్, హెల్త్ సెంటర్, స్పా, టెంపుల్, సూపర్ స్పీడ్ ఎలివేటర్లు, స్నా రూమ్ తదితర అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇంటిలో 600 మంది సిబ్బంది పనిచేస్తారు.  

5 /7

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా ఆంటిలియాను గుర్తించారు. ఈ భవనం విలువ రూ.15 వేల కోట్లు. 'గ్రీన్ టవర్ ఆఫ్ ముంబై'గా ఆంటిలియాను పిలుస్తారు.  

6 /7

మూడు హెలిప్యాడ్‌లను నిర్మించారు. ఇది భూకంపాలను సైతం తట్టుకునే విధంగా నిర్మించారు. రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత వరకు భూకంపం వచ్చినా చెక్కుచెదరదు.   

7 /7

అంబానీ కుటుంబం ఆంటిలియా భవనంలో 26వ అంతస్తులో ఉంటుంది. ఈ ఫ్లోర్‌లోని అన్ని గదులకు మంచి సూర్యకాంతి, గాలి ఉంటుంది. ఈ ఫ్లోర్‌లో కేవలం అంబానీకి అత్యంత సన్నిహితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.