Sankranti And Bhogi Simple Muggulu Designs: ఈ సంక్రాంతి, భోగి, కనుమ సందర్భంగా మీ ఇంటి ముందు మంచి ముగ్గులు పెట్టాలనుకుంటున్నారా? అయితే కొత్త డిజైన్స్ రానే వచ్చాయి. ఇలా సులభంగా మీ ఇంటి ముందు ముగ్గులు పెట్టేయండి.
Sankranti And Bhogi Simple Muggulu Designs 2025: హిందువులు ప్రతి పండగను ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి మూడు రోజుల పండగను ఎంతో అద్భుతంగా కనివిని ఎరగని రీతిలో జరుపుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా ఆనందంతో ఉంటారు. ఇంటిముందు ప్రత్యేకమైన కొత్త డిజైన్స్‌తో కూడిన ముగ్గులను వేస్తూ సంక్రాంతి మూడు రోజుల పండగను ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగకు పిండివంటలతో పాటు ముగ్గులు కూడా హైలెట్‌గా నిలుస్తాయి. అందుకే చాలామంది ఈ పండగ సమయంలో ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ప్రత్యేకమైన డిజైన్స్ తో కూడిన ముగ్గులను వేస్తూ ఉంటారు.
పండగ రోజు చుక్కలతో కూడిన అద్భుతమైన డిజైన్స్ కలిగిన ముగ్గులు ఇష్టపడి మరీ వేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో క్లుప్తంగా వివరించారు. అందుకే ముగ్గులు వేయడం తరతరాలుగా వస్తున్నా ఒక సాంప్రదాయం.
ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ మొదటగా ముగ్గులతో ప్రారంభమవుతుంది. ఉదయాన్నే మహిళలంతా ఇంటి ముందు ముగ్గును వేసుకొని గొబ్బిళ్లు పెట్టుకొని సంక్రాంతి పండగను ప్రారంభిస్తారు. చాలామంది ఈ సమయంలో ఆకర్షనీయంగా నిలిచేందుకు కొత్త కొత్త ముగ్గులు వేస్తారు.
ఈ మూడు రోజుల పాటు సాగే పండగ రోజున మీరు కూడా మీ ఇంటి ముందు మంచి చుక్కల ముగ్గు వేయాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేకమైన డిజైన్స్ మీకోసమే. వీటిని చూస్తూ మీ ఇంటి ముందు ఎంతో సులభంగా ముగ్గులు వేయండి.
చాలామంది ఎక్కువగా పూలతో కూడిన ముగ్గుల డిజైన్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో రంగురంగులకు కలర్స్ నింపి వాకిలిని అందంగా ముగ్గులతో నింపేస్తారు. మీరు కూడా ఈ సింపుల్ ముగ్గు వేసుకొని వాకిలిని అందంగా తీర్చిదిద్దండి.