AP Govt Sankranti Gift: సంక్రాంతికి ఏపీ సర్కార్ భారీ గిఫ్ట్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు జమ

AP Govt To Release Pending Bills: సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిల చెల్లింపునకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించిన సీఎం చంద్రబాబు.. అనంతరం పెండింగ్ బిల్లుల రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ వర్గాలకు మొత్తం రూ.6,700 కోట్లను చెల్లించనున్నారు. నేటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
 

1 /5

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి కానుక అందజేసింది. అన్ని వర్గాలకు కలిపి రూ.6700 కోట్లు బిల్లుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  

2 /5

ఉద్యోగులకు GPF, సరెండర్ లీవులు, CPS కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం రూ.1300 కోట్లు విడుదల కానున్నాయి. ఉద్యోగులకు రూ.519 కోట్లు GPF, పోలీసు శాఖకు సంబంధించి నాలుగు సరెండర్ లీవుల ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ సరెండర్ లీవులకు మొత్తం రూ.214 కోట్లు రిలీజ్ చేయనుఉన్నాఉఉ. 54 వేల 900 మంది పోలీసులకు లబ్ధి చేకురనుంది. ఒక నెల CPS కంట్రిబ్యూషన్ రూ.300 కోట్లు, CPS స్కీమ్స్‌కు రూ.627 కోట్లు, TDS చెల్లింపులు రూ.265 కోట్లు విడుదల చేయనున్నారు.  

3 /5

అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్‌ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రూ.244 కోట్లు కౌలు చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ఆసుపత్రులకు చెల్లించేందుకు రూ.400 కోట్లు రిలీజ్ చేయనున్నారు. డ్రగ్స్, మెడిసిన్స్‌కు రూ.100 కోట్లు చెల్లించనున్నారు.  

4 /5

విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కింద రూ.788 కోట్లు అందించనున్నారు. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి రూ.10 లక్షలలోపు ఉన్న అన్ని బిల్లులు చెల్లించనున్నారు. దాదాపు రూ.506 కోట్లు విడుదల కానున్నాయి.  

5 /5

MSME రూ.90 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కంలకు రూ.500 కోట్లు, ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులు రూ.366 కోట్లు, అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న మరి కొన్ని బిల్లులు, బకాయిలు విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.