Motorola Edge 50 Fusion Vs Edge 50 Pro: ఈ రెండింటిలో ఏది బెస్ట్‌.. దీనికే తక్కువ ధర.. కళ్లు చెదిరే ఫీచర్స్!

Motorola Edge 50 Fusion Vs Motorola Edge 50 Pro: అత్యంత తక్కువ ధరల్లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో రెండు.. వీటిని మోటరోలా కంపెనీ ఇటీవలే లాంచ్‌ చేసింది. అంతేకాకుండా అత్యంత తగ్గింపుతో ధరల్లోనే విక్రయిస్తోంది. వీటి రెండింటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే చాలా మంది ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఫీచర్స్‌ సిమిలర్‌ ఉండడంతో ఏది కొనుగోలు చేయాలా? అని తికమక పడుతున్నారు. ఈ రెండింటి ది బెస్ట్ ఫీచర్స్‌ కలిగి మొబైల్‌ను ఇప్పుడు తెలుసుకోండి. 
 

1 /7

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే, మొదట ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌  Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్‌ మిడ్-రేంజ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవది ఎడ్జ్ 50 ప్రో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌తో వస్తోంది.   

2 /7

ఇక రెండు మొబైల్స్‌ డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే.. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల OLED 4k డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఎడ్జ్ 50 ప్రో డిస్‌ప్లే రిఫ్రెష్ రేటు 144Hzను కలిగి ఉంటుంది.   

3 /7

ఇక ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని బ్యాంక్‌ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం 50MP OIS ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఇందులో అదనంగా టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.  

4 /7

ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఎడ్జ్ 50 ప్రో మొబైల్‌ మాత్రం 4610mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది 125W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.  

5 /7

మోటరోలా కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్‌ IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ IP68 రేటింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.   

6 /7

ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లో కంటే అనేక అదనపు ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్టీరియో స్పీకర్‌లు, NFC మొదలైన ఫీచర్స్‌ అదనంగా లభిస్తాయి. ఇవే కాకుండా అనేక కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

7 /7

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మంచిదేదంటే.. అత్యంత చౌకగా మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్‌ కలిగిన మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఎడ్జ్ 50 ఫ్యూజన్ చాలా బెస్ట్‌.. ఇక  బెస్ట్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ చార్జింగ్ కావాలనుకునేవారికి ప్రో వేరియంట్‌ చాలా బెస్ట్..