Test Cricket Records: బుమ్రా రికార్డుకు ఏడాది.. ఒకే ఓవర్‌లో 35 పరుగులతో స్టువర్డ్ బ్రాడ్‌కు చుక్కలు

Most Expensive Over In Test Martches: టెస్టులు అంటే స్లో బ్యాటింగ్.. బోరింగ్ అని భావించే క్రికెట్ అభిమానులను కొందరు బ్యాట్స్‌మెన్లు టీ20ల తరహాలో మెరుపులు మెరిపించి అలరించారు. టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధికంగా 35 పరుగులు వచ్చాయి. ఇది కూడా భారత్ బౌలర్‌పై ఉండడం విశేషం.

1 /5

టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పేరు మీద ఉంది. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించే బుమ్రా.. తొలిసారి బ్యాట్‌కు పనిచెప్పాడు. సరిగ్గా ఏడాది క్రితం ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో బుమ్రా 35 పరుగులు రాబట్టడం విశేషం. బుమ్రా ఇందులో 29 పరుగులు చేయగా.. 6 పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. ఈ ఓవర్‌లో వరసుగా 4,w4,nb6,4,4,4,6,1 రన్స్ వచ్చాయి.   

2 /5

ఒక ఓవర్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. 2003-04లో సౌతాఫ్రికాపై స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ వేసిన ఒక ఓవర్లో 28 రన్స్ చేశాడు.  

3 /5

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ మూడో స్థానంలో ఉన్నాడు. 2013-14లో జేమ్స్ అండర్సన్ వేసిన ఒక ఓవర్‌లో జార్జ్ బెయిలీ 28 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌లో బెయిలీ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు.  

4 /5

సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ కూడా ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. జో రూట్ వేసిన ఒక ఓవర్లో కేశవ్ మహారాజ్ 28 రన్స్ బాదాడు.   

5 /5

పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఒక ఓవర్లో 27 పరుగులు చేశాడు. 2005లో లాహోర్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్సర్ల సాయంతో 27 రన్స్ చేశాడు.