TGSRTC: తెలంగాణలో మరల కొలువుల జాతర మొదలైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తొంది.
తెలంగాణలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల ఎగ్జామ్ లు జరుగుతుండటంతో నిరుద్యోగులు పండుగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే టీజీపీఎస్సీ..గ్రూప్ 1 ప్రిలీమ్స్, గ్రూప్2, గ్రూప్ 3 ఎగ్జామ్ లను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
అదే విధంగా ప్రస్తుతం ఈ ఎగ్జామ్ ల రిజల్ట్ లను.. కొత్త ఏడాది మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మరో నోటిఫికేషన్ కోసం.. తెలంగాణ సర్కారు సిద్దమైనట్లు తెలుస్తొంది.
తెలంగాణ ఆర్టీసీలో.. కొలువుల జాతర ఉండనున్నట్లు సమాచారం. కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త బస్సులను సైతం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు.
రేవంత్ సర్కారు ఇప్పటికే తెలంగాణలో.. మహాలక్ష్మీ పథకంను అమలు చేస్తుంది. దీనిలో భాగంగా.. మహిళలకు , బాలికలు,ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.దీంతో అన్ని రూట్లలో రద్దీ పెరిగినట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం మరిన్ని బస్సులు కొనుగోలు చేసి.. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అదనపు బస్సులు వస్తే.. రద్దీ సమస్యలు తప్పుతాయని మంత్రి పొన్నం చెప్పినట్లు తెలుస్తొంది.
15 ఏళ్లు దాటిన బస్సుల్ని స్క్రాప్ కు తరలిస్తామని చెప్పినట్లు తెలుస్తొంది. అదే విధంగా మరిన్ని సూపర్ లగ్జరీ, సెమి డీలక్స్, ఇతర బస్సుల్ని కూడా అందుబాటులోకి తెనున్నట్లు కూడా మంత్రి పొన్నం ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం.