Microsoft New Office with Taj Mahal look: తాజ్‌మహల్‌ను ప్రతిబింబిస్తున్న నోయిడా మైక్రోసాఫ్ట్ ఆఫీసు

  • Jan 28, 2021, 22:08 PM IST

 

Microsoft New Office with Taj Mahal look: మైక్రోసాఫ్ట్ ఇండియా తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 1998లో ప్రారంభించింది. ఆ తరువాత బెంగళూరులో మరో సెంటర్ తెరిచింది. ఇప్పుడు నోయిడాలో మూడవ సెంటర్ తెరిచింది. 

1 /6

2 /6

తాజ్‌మహల్ స్ఫూర్తిగా తీసుకోవడం వెనుక చాలా కీలకమైన ఉద్దేశ్యముందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్థానిక వనరులు, స్థానిక సామగ్రి ఉపయోగం ప్రధాన ఆలోచన అని సంస్థ తెలిపింది. 

3 /6

మైక్రోసాఫ్ట్ నోయిడా ఫెసిలిటీలో ఆర్‌అండ్‌డీ పని జరుగుతుంది. కొత్త టెక్నాలజీ ఆధారిత బిజినెస్ స్ట్రాటెజీపై ఇక్కడ పని జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్, గేమింగ్‌పై దృష్టి సారిస్తారు. 

4 /6

మైక్రోసాఫ్ట్ ఈ కార్యాలయంలోపలి భాగంలో తాజ్‌మహల్ అతిపెద్ద ఫోటో ఉంది. లోపలంతా తాజ్‌మహల్‌లానే డిజైన్ చేశారు. బిల్డింగ్ మొత్తం ఈకో ఫ్రెండ్లీ నిర్మాణం కావడం విశేషం.

5 /6

నోయిడాలో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఎన్సీఆర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. దేశంలో మూడవ రీసెర్చ్ సెంటర్ ఇది. హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే రెండు సెంటర్లున్నాయి. నోయిడా బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే..ఈ బిల్డింగ్ డిజైన్ తాజ్‌మహల్‌ను ప్రతిబింబించేలా నిర్మించారు. 

6 /6

ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ నోయిడాలో కొత్తగా రీసెర్చ్ సెంటర్ ప్రారంభించింది. తాజ్‌మహల్‌ను ప్రేరణగా తీసుకుని అదే విధంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. ఈ కొత్త సెంటర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా రీసెర్చ్‌పై పని చేస్తుంది. ఇండియాలో ఇది మూడవ సెంటర్.