Micromax IN Note 3 Price: వెరీ చీప్‌ ధరకే.. Micromax నుంచి మరో మొబైల్‌.. ఫీచర్స్‌ అదుర్స్..

Micromax IN Note 3 Price: త్వరలోనే భారత మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ నుంచి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఈ మొబైల్ శక్తివంతమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో విడుదల కాబోయే మైక్రోమ్యాక్స్ మొబైల్ కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
 

  • Jan 26, 2025, 14:24 PM IST

Micromax IN Note 3 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ (Micromax) ఒకప్పుడు మార్కెట్‌ని ఏలి పారేసింది. గతంలో ఈ కంపెనీ విడుదల చేసిన ఆండ్రాయిడ్ మొబైల్స్ కి అద్భుతమైన డిమాండ్ ఉండేది. అంతేకాకుండా 2000 సంవత్సరంలోనే అద్భుతమైన ఫీచర్స్ తో కొత్త కొత్త మొబైల్స్ ను విడుదల చేసింది. అయితే ఈ మైక్రోమ్యాక్స్ మరోసారి ఇదే గుర్తింపును పొందేందుకు అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ తో మరోసారి మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోయే మొబైల్స్ శక్తివంతమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నాయి. ఈ మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

 
1 /5

త్వరలోనే ఈ కంపెనీ విడుదల చేసి మొబైల్ మైక్రోమ్యాక్స్ IN నోట్ 3 పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెట్‌అప్‌తో పాటు బ్యాటరీ బ్యాక్అప్ తో విడుదల కాబోతోంది. ఇక మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ మైక్రోమ్యాక్స్ IN నోట్ 3 స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.     

2 /5

ఈ మొబైల్ స్క్రీన్ పవర్‌ఫుల్ ప్రొటెక్షన్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఇది వివిధ రకాల కలర్ ఆప్షన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మైక్రోమ్యాక్స్ IN నోట్ 3 లోపల MediaTek Helio G96 ప్రాసెసర్ తో అందుబాటులోకి రాబోతోంది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఈ మొబైల్ చాలా బాగా వర్క్ అవుతుంది.     

3 /5

ఈ మైక్రోమ్యాక్స్ IN నోట్ 3 (Micromax IN Note 3) స్మార్ట్ ఫోన్ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో మొదటగా విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఎస్డి కార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ ను పెంచుకునే అవకాశాన్ని కూడా మైక్రోమ్యాక్స్ ఈ మొబైల్లో అందిస్తోంది. ఇక ఈ మొబైల్ బ్యాక్ సెట్ అప్ లో ట్రిపుల్ కెమెరా సెన్సార్లను కలిగి ఉంటుంది.     

4 /5

ఈ Micromax IN Note 3 మొబైల్‌లోని బ్యాక్ సెట్ అప్‌లో ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక దీనికి తోడు ఇతర కెమెరా సెన్సార్ కూడా లభిస్తాయి. దీని ఫ్రంట్ భాగంలో 16 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ  5000 mAhతో విడుదల కాబోతోంది.     

5 /5

ఇక ఈ Micromax IN Note 3 స్మార్ట్ ఫోన్ Android 12పై పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది స్పెషల్ భద్రత కోసం సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన కొన్ని ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ కు సంబంధించిన లాంచింగ్ తేదీని మైక్రోమ్యాక్స్ అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.