Yamaha Mt-09 Sp Price: భారత మార్కెట్లోకి యమహా నుంచి మరో పవర్‌ఫుల్ బైక్.. ఈ బైక్ ధరెంతో తెలుసా?

Yamaha Mt-09 Sp Price In India: భారత మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన Yamaha MT-09 SP మోటార్ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి రాబోతుంది. ఈ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Jan 26, 2025, 13:58 PM IST

Yamaha Mt-09 Sp Price In India: యువత ఎక్కువగా స్పోర్ట్స్ పైకులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వివిధ మోటార్ సైకిల్ కంపెనీలు కొత్త కొత్త స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్ ను విడుదల చేశాయి. అయితే యమహా కూడా తమ కొత్త బైక్ను పరిచయం చేసింది. ఇది గతంలో విడుదలైన MT సిరీస్‌కు అప్డేట్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మోటార్ సైకిల్ Yamaha MT-09 SP పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఈ మోటార్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

Yamaha MT-09 SP మోటార్ సైకిల్ డిజైన్, ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ బైక్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలోని 41 mm USD ఫోర్క్ కలిగి ఉంటుంది. ఇక ఈ మోటార్ సైకిల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి రాబోతోంది.    

2 /5

కొత్త Yamaha MT-09 SP మోటార్ సైకిల్ 890 cc ఇన్‌లైన్ 3-సిలిండర్ ఇంజన్‌తో విడుదల కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది 93 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ బైక్ లో మొత్తం మూడు రైడింగ్ మోడ్లను కలిగి ఉండబోతున్నట్లు వెల్లడించింది.     

3 /5

ఈ స్పోర్ట్స్ బైక్ భద్రత పరంగా అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్ స్లిప్ రెగ్యులేటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్ సిస్టమ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఫ్రంట్‌లో వీళ్ళు కంట్రోల్ సిస్టం కూడా తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.    

4 /5

ఇక ఈ మోటార్ సైకిల్ విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ  ఇదే సంవత్సరంలో మే లేదా జూన్ నెలలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి విడుదలయితే.. అనేక రకాల శక్తివంతమైన స్పోర్ట్స్ బైకులతో పోటీపడే అవకాశాలు ఉన్నాయి.  

5 /5

ఈ కొత్త Yamaha MT-09 SP మోటార్ సైకిల్ ధర వివరాల్లోకి వెళితే.. ఈ బైక్ కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. దీనిని కంపెనీ స్పోర్ట్స్ బైక్‌గా విడుదల చేస్తుంది. కాబట్టి దీని ధర సుమారు రూ. 13 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.