Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి కమై బ్యాక్ ఇచ్చిన తరువాత.. ఆయన రేంజ్ లో ఒక్క విషయం కూడా సాధించలేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ పరంగా విజయం సాధించినప్పటికీ.. ఆ సినిమా కథ సైతం ఎన్నో విమర్శలు తెచ్చి పెట్టుకుంది. ఈ క్రమంలో మెగా ఫాన్స్ చిరంజీవి కూతురు సుస్మిత పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతేమిటో ఒకసారి చూద్దాం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇటీవలే గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన స్టైల్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే అలాంటి స్టైల్ ని పూర్తిగా చెడగొట్టింది అంటూ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సుస్మిత కొణిదెల చిరంజీవి పెద్ద కూతురుగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా అందరికీ మంచి సుపరిచితురాలు. చిరంజీవి రీ ఎంట్రీ లో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా నుంచి ఈమె తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒకవైపు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి శ్రీదేవి శోభన్ బాబు, సేనాపతి వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.
మరోవైపు భోళాశంకర్ సినిమాకి కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం గమనార్హం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ పై మెగాస్టార్ అభిమానులు ఏ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అంతే కాదు చిరంజీవి లుక్కుపై కూడా ఫైర్ అవుతున్నారు.
సైరా నరసింహారెడ్డి సినిమా ముందు వరకు కూడా చిరంజీవి కాస్ట్యూమ్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ సినిమా తర్వాత ఆయన కాస్ట్యూమ్స్ అసలు ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ రంగస్థలం సినిమాకి తప్ప సుస్మిత చేసిన ఏ చిత్రానికి కూడా కాస్ట్యూమ్స్ సరిగ్గా లేవని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు 70 ఏళ్ల వయసులో కూడా జైలర్, వేట్టయాన్ చిత్రాలలో రజనీకాంత్ కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. కానీ చిరుకి మాత్రం ఇలాంటి కాస్ట్యూమ్ ఎందుకు అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.
దీనికి తోడు ఇటీవల విశ్వంభర టీజర్ కూడా విడుదల అయ్యింది. అందులో కూడా ఆయన లుక్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో మరొకసారి అసలు సుస్మిత చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వద్దు అని ఇంకొక డిజైనర్ ను రంగంలోకి దింపాలని దర్శక నిర్మాతలను కోరుతున్నారు. మరి ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.