Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ... ఇటీవల నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి లాంచ్ చేసిన వాహనమే ఈ మారుతి సుజుకి జిమ్నీ. ఎప్పుడైతే ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ వాహనాన్ని ఆవిష్కరించిందో.. అప్పటి నుంచే ఎస్‌యూవీ, టియూవీ వెహికిల్స్ తీసుకోవాలనుకునే వారి కన్ను ఈ వాహనంపై పడింది.

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ... ఇటీవల నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి లాంచ్ చేసిన వాహనమే ఈ మారుతి సుజుకి జిమ్నీ. ఎప్పుడైతే ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ వాహనాన్ని ఆవిష్కరించిందో.. అప్పటి నుంచే ఎస్‌యూవీ, టియూవీ వెహికిల్స్ తీసుకోవాలనుకునే వారి కన్ను ఈ వాహనంపై పడింది.

1 /7

Maruti Suzuki Jimny: జూన్ 7న మారుతి సుజుకి జిమ్నీ విక్రయాలకు అందుబాటులోకి రానుంది. మహింద్రా థార్, ఫోర్స్ మోటార్స్ తయారు చేసిన ఫోర్స్ గుర్ఖ లాంటి వాహనాలకు పోటీగా మారుతి సుజుకి లాంచ్ అయింది. 

2 /7

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ రఫ్ అండ్ టఫ్ పర్పస్‌లో వినియోగించుకునే అవకాశం ఉండటంతో టెయిల్ డోర్‌పై స్పేర్ వీల్, వెనుక భాగంలో నాలుగు పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.

3 /7

Maruti Suzuki Jimny: 1.5L ఇంజన్ కలిగిన మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఐదు గేర్లతో 16.94 కిమీ మైలేజ్ ఇస్తుండగా.. 4 స్పీడ్ ఆటో-ట్రాన్స్‌మిషన్‌లో 16.39 కిమీ మైలేజ్ ఇస్తుంది. 

4 /7

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ డాష్ బోర్డు నలుపు రంగులో ఉంటుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లతో అనుసంధానం చేసుకునేందుకు వీలుగా 9 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ డిస్‌ప్లే కూడా ఉంది. 

5 /7

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ వెనుక సీటింగ్ కూడా 50 : 50 సగంలో డివైడ్ చేసి ఉంటుంది. అలాగే సీట్లో కూర్చున్న వారు కంఫర్టుగా రిలాక్స్ అయ్యేందుకు వీలుగా 2 స్టేజ్ రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. 

6 /7

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ సెంటర్ కన్సోల్‌పై భాగంలో 2 కప్ హోల్డర్స్‌తో పాటు రియర్ పవర్ విండో బటన్స్ కూడా ఉన్నాయి. 

7 /7

Maruti Suzuki Jimny: 5 డోర్ ఫార్మాట్‌లో వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ వాహనంలో 208 లీటర్ల బూట్‌స్పేస్ ఉంది. ఒకవేళ వెనుక భాగంలో ఉన్న రెండు సింగిల్ సీట్లను మలిచినట్టయితే.. అది 300 లీటర్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.