Maruti Suzuki Fronx: ఫ్రాంక్స్ కారు ధర.. మైలేజ్.. ఇంజన్.. ఫీచర్స్.. దర్జాలో రారాజు.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Maruti Suzuki Fronx Price: మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి సుజుకి లాంచ్ చేసిన ఫ్రాంక్స్ ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. SUV మోడల్ తరహాలో ఉన్న ఈ కారు లుక్ బాలెనోకు, మినీ గ్రాండ్ వితారాకు మధ్య రకంలా కనిపిస్తుంది.

  • Apr 06, 2023, 19:50 PM IST

Maruti Suzuki Fronx Price, Mileage & Features: మారుతి సుజుకి బలెనో డిజైన్ ఆధారంగా తయారైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో ఒక ఎస్‌యువి కారుకు ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి రెండు పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్ ద్వారా 89bhp , 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. రెండోది 1.0-లీటర్ K-సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్ కారు. 99bhp సామర్థ్యంతో 147.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

1 /10

ఇండియన్ రోడ్స్ పై సందడి చేయనున్న ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్‌ కారుకి గట్టి పోటీని ఇస్తుందని మారుతి సుజుకి భావిస్తోంది.

2 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

3 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ముందు భాగంలో అమర్చిన గ్రిల్స్, LED హెడ్ ల్యాంప్స్, DRLs ఆకట్టుకునేవిగా ఉన్నాయి. 

4 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఇంటీరియర్స్ చూస్తే మారుతి వితారా బ్రెజ్జాలోని బ్లాక్ అండ్ వైన్ థీమ్ గుర్తుకొస్తుంది. 

5 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 308 litre బూట్ స్పేస్, బాలెనో తరహాలో విశాలమైన లెగ్ రూమ్ సౌకర్యం ఉంది.

6 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 1.2 లీటర్, 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

7 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో మాన్వల్, ఏఎంటీ, ఏటీ గేర్‌బాక్సులో వేరియంట్స్‌లో లభిస్తోంది.

8 /10

సబ్-కాంపాక్ట్ SUVలను టార్గెట్ చేసుకుని వచ్చిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మార్కెట్లోకి వస్తే.. టాటా పంచ్ లాంటి కార్ల సేల్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు.

9 /10

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు వెనుక భాగం లుక్ సైతం SUV లవర్స్‌ని టెంప్ట్ చేసేదిలానే ఉంది. 

10 /10

ఫ్రాంక్స్ కారు ధర, మైలేజ్, ఇంజన్, ఫీచర్స్.. దర్జాలో రారాజు.. ఫోటోలు చూస్తే ఫిదా