Anasuya Saree Photos : అందానికి అడ్రస్‌.. చీరకట్టులో అనసూయ.. చూస్తే మహిళలకు అసూయే

Anasuya Bharadwaj Saree Photoshoot     అందానికే అడ్రస్‌గా నిలిచే అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె అందాల ఆరబోత, చీరకట్టు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆమె వస్త్రాధారణ ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన చీరకట్టులోని ఫోటోలను చూసి నెటిజన్లకు కునుకు కరువయ్యేలా ఉంది.

  • Apr 06, 2023, 18:56 PM IST
1 /5

యాంకర్‌గా బుల్లితెరపై అనసూయ వేసిన ముద్ర.. నటిగా వెండితెరపై వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. అటు గ్లామర్‌గా కవ్విస్తూనే ఇటు నటిగా మెప్పిస్తూ వచ్చింది.

2 /5

అనసూయ కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ పాత్రలెన్నో పోషించింది. క్షణం, రంగస్థలం సినిమాలోని అనసూయ నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా ముగ్దులయ్యారు.

3 /5

రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రతో అందరినీ మెప్పించింది. అయితే మళ్లీ ఆ స్థాయి పాత్రలో అనసూయ అలరించలేకపోయింది. పుష్పలో వేసిన దాక్షాయణి పాత్ర ట్రోలింగ్‌కు గురైంది.

4 /5

ఇప్పుడు అనసూయ పూర్తిగా బుల్లితెరకు దూరమైంది. అక్కడ కాన్సెప్టులు, టీఆర్పీ స్టంట్లు చూసి అనసూయకు విసుగెత్తినట్టుంది. అందుకే సినిమాల మీదే తన ఫోకస్ పూర్తిగా పెట్టేసింది.

5 /5

అనసూయ మాత్రం సోషల్ మీడియాను వదలడం లేదు. నెట్టింట్లో తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. తాజాగా చీరకట్టులో అనసూయను చూస్తే.. అందానికి అడ్రస్‌లా.. అందరికీ అసూయ పుట్టేలా ఉంది.