Manushi Chhillar: మన దేశం నుంచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న అతికొద్ది మందిలో మానుషి చిల్లర్ ఒకరు. అందాల కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అంతంత మాత్రమే అందుకే గ్లామర్ గేట్లను ఎత్తేసింది.
మానుషి చిల్లర్ 1997 మే 14న హర్యానాలోని రోహ్ తక్ లో జన్మించింది. ఆ తర్వాత 2017లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుంది. అదే యేడాది ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైంది.
అటు మిస్ వరల్డ్ గా అందాల కిరీటాన్ని గెలుచుకొని సంచలనం రేపింది. ఆమె 2022లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ సమ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో నటిగా పరిచయమైంది.
‘సమ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాకు టాక్ బాగున్నా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేదు. ఆ తర్వాత ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది.
ఈ మిస్ వరల్డ్ తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా ‘ఫైటర్’ మూవీని పోలీ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.
మానుషి చిల్లర్ విద్యాభ్యాసం అంతా ఢిల్లీతో పాటు హర్యానాలోని సోనిపత్ లో జరిగింది. మానుషి తండ్రి డీఆర్డీవో లో పెద్ద సైంటిస్ట్. మరోవైపు ఈమె తల్లి ప్రముఖ న్యూరో కెమిస్ట్ డాక్టర్.
అందాల కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్ కు వరుస అవకాశాలు వస్తున్నా.. సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈమె ‘టెహ్రాన్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది.