Malavika Mohanan Photos: శారీలో ఎంత ముద్దుగా ఉందో ఈ బొమ్మ!!

Malavika Mohanan Photos: రజనీకాంత్ 'పేట' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్.. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోందీ భామ. ఇప్పుడు చీరలో ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 
 

  • Mar 12, 2022, 23:17 PM IST
1 /4

1993 ఆగస్టు 4వ తేదీన కేరళలోని కానూరులో మాళవిక మోహనన్ జన్మించింది. ముంబయిలోని విల్సన్​ కళాశాలలో మాస్​ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.   

2 /4

హిందీ, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కేయూ మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మోడలింగ్ పై ఆసక్తితో అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో నటించింది.   

3 /4

మలయాళ చిత్రం 'పట్టం పోలే'తో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్ లో రజనీకాంత్​ 'పేట' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

4 /4

హీరో విజయ్ నటించిన 'మాస్టర్'​లో హీరోయిన్​గా నటించింది. ​'బియాండ్​ ది క్లౌడ్స్​' (2017) సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టిందీ భామ.