Mahatma Gandhi Grand daughter: మహాత్మా గాంధీ మనవరాలు హాలీవుడ్లో ప్రవేశించి తన సత్తా చాటుతున్నారు. తమ పూర్వీకుడైన మహాత్మా గాంధీ జీవన శైలికి భిన్నంగా ఆమె ఆధునికంగా జీవిస్తున్నారు అని నెటిజెన్లు వాదిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసే పనేంటి ఎందుకు విమర్శల పాలవుతుందో తెలుసుకుందాం.
Mahatma Gandhi Grand daughter: మహాత్మా గాంధీ గురించి మన దేశంలో అందరికీ తెలిసిందే. అయితే ఆయన పిల్లల గురించి ఆయన సంతానం గురించి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ చేసిన సేవలు ఆయన సూచించిన సిద్ధాంతం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంది.
గాంధీ చెప్పిన అహింస మార్గం నేటికీ ప్రపంచ దేశాలకు అనేక ఉద్యమాలకు ఊత కర్రగా నిలుస్తోంది. అమెరికాలోని నల్లజాతీయుల నుంచి అరబ్ దేశాల్లోని ఉద్యమకారుల వరకు అందరికీ గాంధీ సూచించిన అహింస సత్యాగ్రహమే ఆదర్శ మార్గంగా నిలిచింది. అలాంటి మహాత్మా గాంధీ తరువాతి తరం ఎలా ఉంది. అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలగడం సహజమే.
మహాత్మా గాంధీ కి సంబంధించిన ప్రతి విషయం గాంధీ జయంతి రోజున దేశ ప్రజలు మరించుకుంటారు. అయితే గాంధీ కుటుంబానికి చెందిన ఐదవ తరం వారసురాలు మేధా గాంధీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెంటర్ పాయింట్ గా నిలిచింది.
ఈ మేధా గాంధీ ఎవరంటే మహాత్మా గాంధీ పెద్ద కొడుకు కాంతిలాల్ ఆయన కుమారుడు హరిలాల్ మనవరాలే మేధా గాంధీ.ప్రస్తుతం మేధా గాంధీ హాలీవుడ్ లో ప్రముఖ నృత్యకారిణి అలాగే మంచి రచయిత్రి వీరు అమెరికాలో స్థిరపడ్డారు.
మహాత్మా గాంధీ ఐదవ తరానికి చెందిన మేధా గాంధీ పూర్తిగా గాంధీ బాట నుంచి వేరు అయ్యారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఆమె తాను ఎంపిక చేసుకున్న రంగంలో చక్కగా రాణిస్తున్నారని ఇందులో ఆయన సూచించిన మార్గం నుంచి పక్కకు జరగడం వంటివి ఏమీ లేవని మరికొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. మహాత్మా గాంధీ పనియ దైవం అని అన్నం పెడుతుందని చెప్పారని ఇప్పుడు ఆమె ఎంపిక చేసుకున్న రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారని ఇందులో తప్పేమీ లేదని మరికొందరు నెటిజన్లు వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే మేధా ప్రస్తుతం ప్రముఖ అమెరికన్ షో డేవ్ అండ్ షో కి నిర్మాతగా కూడా ఉన్నారు. దీంతో పాటు ఆమె మట్టి ఇన్ ద మార్నింగ్ షో అనే ఒక టెలివిజన్ షో కూడా నిర్మించారు. అయితే మేధా గాంధీ అమెరికా జీవనశైలికి అలవాటు పడ్డారు. ఆమె పాశ్చాత్య శైలితో జీవిస్తున్నారు . ఆమె ప్రస్తుతం బ్రాండెడ్ జోన్స్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.