Liquor Shops Notification: మద్యం దుకాణాల కేటాయింపుకు మరోసారి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో గీత కులాలకు మద్యం దుకాణాలు కేటాయించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
మద్యం దుకాణాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి, షాపుల కేటాయింపు కూడా చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే తాజాగా మరోసారి నోటిఫికేషన్‌కు సనద్ధమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు గీత కులాలకు 10% మద్యం దుకాణాలు కేటాయించాలని ఎన్నికల హామీ నెరవేర్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశించారు. ఈ ప్రత్యేక మద్యం దుకాణాల కేటాయింపు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.
మొత్తం 3300 కు పైగా మద్యం షాపులు కేటాయించగా అందులో 10 శాతం అంటే 330 వరకు గీత కులాలకు ఇవ్వనున్నారు. షాపుల కోసం ముందుగానే ఫీజు చదివించాల్సి ఉంటుంది. ఒక్క వ్యక్తికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు.. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. ఎన్ని ఫీజు ఎన్ని షాపుల కైనా చెల్లించవచ్చు, కానీ, ఒక్కరికి ఒక్క షాపు మాత్రమే కేటాయిస్తారు.
ఈనేపథ్యంలో గీత కులాలు గౌడ, ఈడిగా, శెట్టిబలిజ, గౌండ్ల మొదలైన గీత కులాలకు పది శాతం షాపులు కేటాయించానున్నారు. ఏపీ రూ.99 కే మద్యం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతి సంవత్సరం మద్యం దుకాణాలు పెరుగుతున్నాయి.. కానీ మద్యం తక్కువ రేటుకు విక్రయించటం వల్ల ప్రభుత్వానికి ఆశించిన లాభాలు రావడం లేదని అధికారులు తెలుపుతున్నారు.