Laxmi Narayana Yogam 2025: వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. 2025లో అందులో శుక్రుడు, బుధుడు కలయిక వలన లక్ష్మి నారాయణ యోగం ఏర్పడుతోంది.
శుక్రుడు, బుధుడు కలయికతో లక్ష్మి నారాయణ యోగం ఏర్పడుతోంది. ఈ యోగాన్ని అత్యంత అరుదైన పవిత్రమైన యోగంగా పరగణించబడుతోంది. దీని వలన కొన్ని రాశుల వారికీ లక్మి దేవి కటాక్షం వలన జీవితంలో మంచి యోగాన్ని అందుకుంటారు. ఇంతకీ ఏయో రాశుల వారికీ ఈ యోగం అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
మిథున రాశి : లక్ష్మి నారాయణ యోగంతో మిథున రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అందుకుంటారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరిగుతుంది. మీరు చేసే పొదుపు వల్ల మీరు ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. మీరు మంచి పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు చేసే ప్రదేశంలో ప్రమోషన్ అందుకుంటారు.
వృషభ రాశి.. బుధ, శుక్ర కలయికల వల్ల ఏర్పడే లక్ష్మి నారాయణ యోగంతో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాలు తొలిగిపోతాయి. ఉద్యోగులు పదోన్నతలు అందుకుంటారు. జీతాల్లో పెరుగుదల ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.
సింహ రాశి.. సింహ రాశి వారికి లక్ష్మి నారాయణ యోగంతో కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. లక్ష్మి దేవి అనుగ్రహంతో డబ్బుకు కొదవ ఉండదు. వాహన సౌఖ్యాన్ని అందుకుంటారు. ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారంగా చెప్పబడింది. ZEE NEWS ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.