Grocery Store Business Idea: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఒక జీవనశైలి. బిజినెస్‌లో విజయం సాధించాలంటే లాభాలు, నష్టాలు రెండింటినీ సమతుల్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో యువత , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా భారీ పెట్టుబడి అవసరం అనేది ఒక పాత భావన. నేటి కాలంలో, మీకు ఉన్న నైపుణ్యాలు, క్రియేటివిటీ మరియు కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు, మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ బోలెడు లాభాలను తీసుకురవడంతో పాటు ఇది ఎప్పటికీ డిమాండ్ ఉన్న వ్యాపారం.
బిజినెస్‌లు అనేక రకాలుగా ఉంటాయి. తక్కువ మంది ఉద్యోగులు, తక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు. అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఎక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు ఉంటాయి.
ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ కిరానా స్టోర్ వ్యాపారం. ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
కిరాణా స్టోర్‌ను ఎంచుకునేటప్పుడు, అది అధిక జనావాసం ఉన్న ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. రోడ్డు ప్రక్కన లేదా మార్కెట్‌కు దగ్గరగా ఉన్న స్థలం మంచిది.
కిరాణా స్టోర్‌ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి స్థలం, గూడంగి, ఫర్నిచర్, స్టాక్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
కిరాణా స్టోర్‌ను ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన లైసెన్సులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార లైసెన్స్ (Trade License), FSSAI లైసెన్స్ (Food Safety and Standards Authority of India), షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ (Shop and Establishment License), GST నమోదు (Goods and Services Tax Registration), లీజ్ ఒప్పందం (Lease Agreement) ఇవి కిరాణాల వ్యాపారాన్నికి ప్రధాన లైసెన్సులు.
మీరు కిరాణా స్టోర్‌ను ప్రమోట్ చేయడానికి వివిధ రకాల మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఫ్లైయర్లు పంపించడం, ఆఫర్లు ఇవ్వడం, సోషల్ మీడియాను ఉపయోగించడం.
మీ వ్యాపారం మరింత పెరగాలంటే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఉత్పత్తులను అమ్మడం. అలాగే పండుగలు, సీజన్లను బట్టి ఉత్పత్తులను అమ్మండి.
కిరాణా స్టోర్ వ్యాపారంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన ప్రణాళిక, కష్టపడే స్వభావం, కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా ఈ వ్యాపారంలో విజయం సాధించవచ్చు.
ఈ వ్యాపారంలో మీరు నెలకు రూ. 90,000 నుంచి సంవత్సరానికి రూ10 లక్షలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరైన పెట్టుడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవచ్చు.
ఈ పథకంలో చిన్న వ్యాపారాలు బాగా పెరిగితే ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభిస్తుంది. ఇతర రుణాలతో పోలిస్తే ముద్ర యోజన ద్వారా అందించే రుణాల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది.