Cricketers vs Tv Anchors: టీవీ యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే

టీమ్ ఇండియా ( Team india) క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తెలుసు కదా. ఇటీవలే గోవాలో స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganesan)తో  ప్రేమలో పడ్డాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపధ్యంలో టీవీ యాంకర్లతో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి తెలుసుకుందామా..
  • Mar 10, 2021, 22:28 PM IST

Cricketers vs Tv Anchors: టీమ్ ఇండియా ( Team india) క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తెలుసు కదా. ఇటీవలే గోవాలో స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganesan)తో  ప్రేమలో పడ్డాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపధ్యంలో టీవీ యాంకర్లతో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి తెలుసుకుందామా..

1 /5

టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్ని (Stuart Binny)ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ మయంతి లేంగర్ ( Mayanti Langer)ను 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బిన్నీ పెద్దగా పేరు సంపాదించకపోయినా..మయంతి మాత్రం మంచి పేరు సాధించింది. 

2 /5

దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మోర్న్ మార్కిల్ (Morne Morkel)2014 డిసెంబర్ నెలలో  తన గర్ల్ ఫ్రెండ్ రోజ్ కెల్లీ (Roz Kelly)ని పెళ్లి చేసుకున్నాడు. రోజ్ ఓ ప్రఖ్యాత యాంకర్. ఛానెల్ 9 లో పని చేస్తోంది. 

3 /5

ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ (Shaun Marsh)2014 ఏప్రిల్‌లో ఛానెల్ 7 యాంకర్‌గా పని చేస్తున్న రెబెకా ఓడోవాన్ (Rebecca O’Donovan)ను పెళ్లి చేసుకున్నాడు. 

4 /5

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson)2010 మే నెలలో తన గర్ల్‌ఫ్రెండ్ లీ ఫర్లాంగ్ (Lee Furlong)ను పెళ్లి చేసుకున్నాడు. లీ ఫర్లాంగ్ స్పోర్ట్స్ ఛానెల్ యాంకర్‌గా పని చేస్తోంది. 

5 /5

న్యూజిలాండ్ టాప్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ ( Martin Guptill)2014 సెప్టెంబర్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ లారా మ్యాక్ గోల్డ్రిక్ ( Laura McGoldrick)ను పెళ్లి చేసుకున్నాడు. మ్యాక్ గోల్డ్రిక్ స్పోర్ట్స్ ఛానెల్ యాంకర్‌గా పని చేస్తోంది.