Kiara Advani: కియారా అద్వానీ నార్త్ భామ అయినా ముఖ్యంగా సౌత్ అందులో తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న టైమ్ లో తన తోటి హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో పలకరించబోతుంది.
కియరా తెలుగులో ఫస్ట్ మూవీ.. కియరా అద్వానీ టాలీవుడ్ లో మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
గేమ్ ఛేంజర్.. కియారా అద్వానీ చాలా యేళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో పలకరించబోతుంది. ఇందులో కియారా పాత్రకు ప్రాముఖ్యత ఉందట. హీరోతో సరిసమానమైన పాత్రలో అలరించడం పక్కా అని చెబుతున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.
కియారా పెళ్లి .. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే కియారా.. తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్ గతేడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది.
ఫస్ట్ మూవీ.. కియారా అద్వానీ.. 2014లో హిందీ చిత్రం ‘ఫగ్లీ’ మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ గా బీటౌను ఏలుతూ ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది.
ఎం.ఎస్.ధోని హిట్.. ఎం.ఎస్.ధోని జీవితం మీద తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ అన్ టోల్డ్ స్టోరీ మూవీతో బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. సినిమాల్లోనే కాకుండా.. లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
న్యూడ్ ఫోటో షూట్.. కియారా.. అప్పట్లో ఒంటిపై బట్టలు లేకుండా న్యూడ్ గా చేసిన ఫోటో షూట్ అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ తో ‘లక్ష్మీ’తో పాటు ‘భూల్ భులయ్యా 2’, జుగ్ జుగ్ జియో, సత్య్ కీ ప్రేమ్ కథ వంటి చిత్రాల్లోని యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకుంది.
కియారా అందాల రచ్చ మొత్తంగా పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతూనే ఉంది.