Andhra Pradesh Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఫీజు చెల్లింపు విధానంపై కీలక మార్పులు చేసింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నుంచి అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై భారీ మార్పులు చేసింది. ఆ విధానం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తోంది. అదే దారిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
గత ప్రభుత్వ విధానంలో తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను జమా చేసేది. దీంతో కాలేజీలు ఒత్తిడి చేసి మరీ విద్యార్థులతో ముందుగానే ఫీజు డబ్బులను కట్టాలని ఆదేశించింది. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఈ మార్పులు చేశారు.
ప్రస్తుతం ఈ విధానంలో మార్పులు చేసి తిరిగి కాలేజీల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులపై ఏ ఒత్తిడి ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం హాజరు తప్పనిసరి చేసింది. దీనిపై త్వరలో ప్రకట చేయనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరం ఎస్సీలకు మినహాయించి కాలేజీల ఖాతాల్లో జమా చేయనుంది.