Keerthy Suresh: పట్టుచీరలో కీర్తిసురేష్.. సొగసు చూడతరమా..

Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి తెలియని వారు ఉండరు. మహానటి సినిమా తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం కీర్తి సురేష్ చీరలో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  • Jan 08, 2024, 20:46 PM IST
1 /7

Keerthi Suresh Pics: రామ్ హీరోగా చేసిన నేను శైలజ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

2 /7

మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు.. తమిళ భాషలలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే చిన్న హీరోలతో.. జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ.

3 /7

కాగా కీర్తి సురేష్ కి మరిచిపోలేని పేరు తెచ్చిపెట్టింది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కనిపించింది కీర్తి సురేష్.

4 /7

మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రానికి గాను నంది అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమా అప్పట్లో కీర్తి సురేష్ కి ఎన్నో ప్రశంసలు కూడా తెచ్చి పెట్టింది.

5 /7

కాగా మహానటి తర్వాత దాదాపు తొమ్మిది ఫ్లాపులు ఈ హీరోయిన్ ని పలకరించాయి. అయినా ఏమాత్రం తగ్గకుండా గత సంవత్సరం నాని దసరా సినిమాలో వెన్నెలగా కనిపించి సూపర్ హిట్ అందుకుంది.

6 /7

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో పట్టుచీరలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లూ చీరలో పద్ధతిగా కనిపిస్తూ.. మల్లెపూలు పెట్టుకొని కీర్తి సురేష్ ఇచ్చిన ఫోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

7 /7

ఈ ఫోటోలను చూసి కీర్తి సురేష్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ చీరలో కీర్తి సురేష్ చూడ చక్కని చందమామలా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.