Keerthy Suresh and Antony Thattil: కీర్తిసురేష్ తన భర్తతో కలిసి తొలి సంక్రాతి వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కీర్తిసురేష్ గతేడాది డిసెంబరు లో తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి పెళ్లి వేడుక హిందు, క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది.
పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ఈ మహానటి బేబీ జాన్ ప్రమోషన్ లలో పాల్గొంది. ఈ మూవీతో మహనటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ అనుకున్న విధంగా హిట్ ను సొంతం చేసుకొలేకపోయింది.
అంతే కాకుండా.. బేబీ జాన్ మూవీ వివాదంలో కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. మరల కీర్తిసురేష్ తన మెడలో పసుపు తాడుతో మంగళ సూత్రం ధరించి అనేక మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్నారు.
కీర్తిసురేష్ , తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. వీరి పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి వేడుకలు కావడంతో ఈ జంట ఫుల్ హ్యపీగా పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
కీర్తిసురేష్ దంపతుల పొంగల్ సెలబ్రేషన్స్ లలో.. విజయ్, కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు.. తమిళ స్టార్ హీరో విజయ్ కూడా పాలు పంచుకోవటం విశేషంగా చెప్పుకొవచ్చు. కీర్తి సురేష్ తన ఇన్ స్టాలో పొంగల్ వేడుకలకు చెందిన ఈ ఫొటోలను షేర్ చేసింది.
కీర్తి సురేష్ ట్రెడిషనల్ యేల్లో సారీ లుక్ లో ఎంతో అందంగా కన్పిస్తున్నారు. అంతే కాకుండా.. మహానటి సెలబ్రేషన్స్ ఇన్ స్టా వేదిక మీద పెట్టిన పోస్ట్ లపై నటి సమంత కూడా స్పందించారు. హర్ట్ ఎమోజీలతొ కొత్త జంట సెలబ్రేషన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.