Model Polling Stations in Karnataka: కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమయం ముంచుకువస్తోంది. మే 10న ఓటింగ్ జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది. ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను తెగ ఆకర్షిస్తున్నాయి.
యలబుర్గా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు వివిధ రకాల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇక్కడ గోడలపై నినదాలు రాశారు.
యలబుర్గా పట్టణంలో ప్రత్యేక పోలింగ్ బూత్‌ను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ముధోల, తుమ్మరగుడ్డిలోని మోడల్ పోలింగ్ బూత్‌లకు పూర్తి వర్లీ కళతో రంగులు వేసి ఆకర్షణీయమైన చిత్రాలను గీశారు.
యలబుర్గా పట్టణంలోని పట్టణ పంచాయతీ, ప్రభుత్వ మోడల్ పాఠశాలను పింక్ పోలింగ్ బూత్‌గా నిర్మించి రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి ఓటేయనున్న నేపథ్యంలో వారికి ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
బేవూరు ప్రభుత్వ తరహా ప్రాథమిక పాఠశాల చిత్రాలు ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పింక్ పోలింగ్ కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పింక్ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది.