IRCTC Shirdi Tour Package: సాయిబాబా భక్తులకు శుభవార్త.. IRCTC హైదరాబాద్‌ - షిరిడీ, శింగనాపూర్‌ టూర్‌ ప్యాకేజీ..

IRCTC Shirdi Tour Package: ఐఆర్‌సీటీసీ ఎప్పుడూ కొత్త ప్యాకేజీను టూరిస్టులకు పరిచయం చేస్తూనే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో చారిత్రాత్మక ప్రదేశాలు, యాత్రలను సందర్శించవచ్చు. ఈ సారి కూడా ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీని ముందుకు తసుకువచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

ప్రయాణీకులకు సులభతరమైన ప్రయాణ సదుపాయాలు కల్పించడానికి ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో సాయిబాబా భక్తులకు కూడా గుడ్‌న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ. హైదరాబాద్‌ నుంచి షిరిడీకి కొత్త టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.  

2 /6

ఈ టూర్ ప్యాకేజీ జూలై 2న ప్రారంభం అవుతుంది. ఇది రెండు రాత్రులు, మూడు పగళ్లు జర్నీ చేసే ట్రిప్‌. ఈ సందర్భంగా షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. దీనికి ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.  

3 /6

ఒకవేళ మీరు హైదరాబాద్‌ నుంచి షిరిడీ వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్‌ నుంచి టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ ట్రిప్‌ కు గుంతకల్‌, కామారెడ్డి, నిజమాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ తిరుపతి నుంచి కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీలో మీరు రైలు, క్యాబ్‌ ద్వారా ప్రయాణం చేస్తారు.  

4 /6

ఐఆర్‌సీటీసీ షిరిడీ ప్యాకేజీ పేరు హైదరాబాద్‌ సాయి సన్నిధి టూర్‌ ప్యాకేజీ. ప్రతి గురువారం టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. కాచిగూడ నుంచి ట్రైన్‌ జర్నీ మొదవుతుంది. ఒక్కక్కరికీ టిక్కెట్‌ ధర స్లీపర్‌ అయితే రూ. 6595, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఒక్కొక్కరికి రూ. 5370, ముగ్గురికి రూ. 5350, ఇక మీతోపాటు మీ పిల్లలు కూడా ప్రయాణిస్తే ఛార్జీలు ఇలా ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్లున్న పిల్లలకు రూ. 4145.  

5 /6

మొదటిరోజు బుధవారం జూలై 3న ప్రారంభమవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి 18:40 కు ట్రైన్‌ నం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. మరుసట రోజు ఉదయం 7 గంటల సమయంలో షిరిడీకి చేరుకుంటారు. అక్కడ హోటల్లో స్టే చేసి సాయిబాబా దర్శనం చేసుకోవాలి.   

6 /6

సాయంత్రం 4 గంటల సమయంలో శనిశింగనాపూర్‌ శనిదేవుడి ఆలయానికి కూడా తీసుకువెళ్తారు. అదే రోజు రాత్రి 20:30 నాగర్సల్‌ స్టేషన్‌ వచ్చి తిరిగి హైదరాబాద్‌ రావడానికి ట్రైన్‌ జర్నీ చేయాలి. ఉదయం కాచిగూడలో 9:45కు చేరుకుంటారు.