Kaju masala curry: జీడిపప్పుతో ఇలా మసాలా కూర చేస్తే.. రోటీల్లోకి భలే బాగుంటుంది..!

Kaju masala curry Recipe: మనం ప్రతిరోజూ కూరగాయలు లేదా ఆకుకూరలను ఉపయోగించి కూరలు తయారు చేసుకుంటాం. ఇక నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌, మటన్‌, చేపలు ఎక్కువగా వండుకుంటారు. ఈ రెండూ కాకుండా ఎప్పుడైనా జీడిపప్పుతో కూర తయారు చేశారా? ఈ కూర రుచి అదిరిపోతుంది. రుచికరమైన కాజు మసాలా కర్రీ మీరు వండుకోవాలనుకుంటున్నారా? ఈ కూర రోటీల్లోకి నంజుకుంటే దాని రుచి భలే ఉంటుంది. ఆ రిపిపీ తెలుసుకుందాం.
 

1 /7

సాధారణంగా డ్రైఫ్రూట్స్‌లో విటమిన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. అందుకే డైట్లో చేర్చుకోవాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కొన్ని వంటల్లో జీడిపప్పు, పిస్తా, కిష్‌మిష్‌ వేసుకుని తయారు చేసుకుంటాం. ఇది వంట రుచిని మరింత పెంచుతుంది.  

2 /7

అయితే, రెస్టారెంట్లో కూడా ఎంతో ప్రత్యేకంగా వడ్డించే జీడిపప్పు మసాలా కూరను మీరు కూడా ఇంట్లో తయారు చేయాల్సిందే. దీనికి పెద్దగా ఏ ఆహార పదార్థాలు కూడా అవసరం లేదు.   

3 /7

జీడిపప్పు- అరకప్పు, ఉల్లిపాయలు-1, టమోటాలు -౩, నానబెట్టిన జీడిపప్పు-౩ స్పూన్లు, దాల్చిన చెక్క- ఒక ఇంచు, యాలకులు, లవంగాలు- చెరో రెండు, కారం- ఒక స్పూన్, బట్టర్-2 స్పూన్లు, కశ్మీరీ కారం -స్పూన్‌, ఉపు- రుచికి సరిపడా, నూనె- 4  స్పూన్లు, కసూరీ మేతీ- ఒక స్పూన్‌ గరం మసాలా- స్పూన్‌, పంచదార- పావు టీస్పూన్‌, నీళ్లు- కూర గ్రేవీకి కావాల్సినంత, కొత్తిమీర, కరివేపాకు, క్రీమ్‌- 2 స్పూన్లు, ధనియాల పొడి- స్పూన్‌  

4 /7

ముందుగా కడాయి తీసుకుని జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జార్‌లోకి మసాలాలు జీడిపప్పుతోపాటు అన్ని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌ పెట్టి నూనె వేయాలి.   

5 /7

అందులో బట్టర్ వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వాసన పోయే వరకు వేయించాలి. టమోటాలు, కారం, కశ్మీరీ కారం, ఉప్పు, జిలకర్ర, ధనియాలు, గరంమాసాలా, పంచదార వేసి కలపాలి.  

6 /7

ఈ కూరను బాగా కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ ఇందులో వేసి కలపాలి. ముందుగా నూనెలో వేయించిన జీడిపప్పు కూడా ఇందులో వేసుకుని కలపాలి. ఆ తర్వాత కూరకు తగ్గినన్ని నీళ్లు పోయాలి.  

7 /7

ఓ ఐదు నిమిషాల తర్వాత ఇందులో మీకు కావాల్సిన నీరు పోసుకుని మరిగించుకోవాలి. పైనుంచి క్రీమ్‌, కొత్తిమీరా వేసి గార్నీష్‌ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కాజు మసాలా కర్రీ రెడీ అవుతుంది. దీన్ని చపాతీలోకి నంజుకుని తింటే ఆ రుచి వేరు.