Gajakesari Yoga 2024: గురుచంద్రుల కలయికతో గజకేసరియోగం.. ఈ రాశికి లాటరీ తగిలినట్టే..

Gajakesari Yoga 2024: గ్రహాల మార్పు ప్రతి రాశిపై ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. గురుచంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల పంట పండనుంది. వీరికి అదృష్ట ద్వారాలు తెరచుకుంటాయి. ఈ యోగం వల్ల మార్చి 13, 14 వరకు ఈ రాశులకు బంపర్‌ లాటరీ తగిలినట్లేనని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
 

1 /6

గజకేసరి యోగం వల్ల మీన రాశికి బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. అంతేకాదు వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పుంజుకుంటుంది. గురుచంద్రుల కలయిక వల్ల మీనరాశివారికి భారీగా ఆర్థిక లాభం కలుగుతుంది.  

2 /6

ఈ యోగం వల్ల వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. సాధారణంగా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. దీంతో వీరి బలం రెట్టింపవుతుంది. ఈ రాశికి ఆస్తులు పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఏ పని చేసిన విజయం పొందుతారు. పనిప్రదేశంలో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది.  

3 /6

వృశ్చిక రాశివారికి కూడా ఈ యోగం వల్ల మంచి గౌరవాన్ని పొందుతారు.గజకేసరియోగం వల్ల ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. పని ప్రదేశంలో మంచి ప్రోత్సాహం లభిస్తుది. ఈ రాశులు కోరుకున్నవన్నీ దొరికే సమయం ఇది.  ముఖ్యంగా ఈ రాశికి ఎవరైనా శత్రువులు ఉంటే వారు మీ ముందు ఓడిపోకతప్పదు.  

4 /6

గజకేసరి యోగం వల్ల తులరాశికి ఆర్థికంగా బాగా కలిసివచ్చే సమయం. వైవాహిక జీవితంలో ఆనందం. ఉద్యోగవ్యాపారాల్లో కూడా భారీ లాభం కలుగుతుంది. ఏదైనా పర్యాటనకు కూడా స్నేహితులతో కలిసి వెళ్లే అవకాశం ఉంది.  

5 /6

గురుచంద్రుల కలయికతో మిథునరాశివారికి బంపర్ లాభాలు కలుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడిపే సమయం. ఈ సమయంలో మిథునరాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పనిప్రదేశంలో మంచి ప్రోత్సాహాం లభిస్తుంది. మిథునరాశివారు పై అధికారుల మన్ననలను కూడా పొందుతారు.  

6 /6

మేషరాశివారు గజకేసరి యోగం వల్ల ఆర్థిక పురోగతి పొందుతారు. తల్లిదండ్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు పొందే సమయం. గురుచంద్రుల కలయిక వల్ల మేషరాశివారి జీవితం ఈ రెండురోజులు సాఫీగా సాగిపోతుంది.