Jr NTR to host MEK season 5: మరోసారి హోస్ట్‌గా రానున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR to host Meelo Evaru Koteeswarudu season 5 tv show | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా చూసే అవకాశం రానుందా అంటే అవుననే తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసిన తారక్ తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  • Dec 11, 2020, 20:09 PM IST

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు 5వ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ రూపొందిస్తున్నారట.

1 /6

హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి ( kaun banega crorepati 2020 ) అనే రియాలిటీ షోకు తెలుగు వెర్షనే ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షో. 

2 /6

ఇదిలావుంటే, టాలీవుడ్‌లో మరో టాక్ కూడా వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ఈసారి హోస్ట్ చేయబోయేది మీలో ఎవరు కోటీశ్వరుడు కాదని... అదే తరహాలో ప్లాన్ చేసిన మరో టాక్ షో అనే టాక్ కూడా వినిపిస్తోంది.

3 /6

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్న తారక్... ఓవైపు ఆ షూటింగ్ మేనేజ్ చేసుకుంటూనే మరోవైపు ఈ రియాలిటీ టాక్ షోను హోస్ట్ చేయనున్నాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

4 /6

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసిన తారక్ ఆ షోతో తాను నటుడిగానే కాదు... టీవీ హోస్టుగానూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ( Image courtesy : Video grab of Star maa )

5 /6

గతంలో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సైతం మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షో ద్వారానే టీవీ హోస్ట్‌గా చిరంజీవి తొలి ప్రయత్నం చేశారు. 

6 /6

ఇంతకీ తారక్ ( Jr NTR ) చేయబోయేది ఏదైనా కొత్త షోనా లేక మీలో ఎవరు కోటీశ్వరుడు 5వ సీజన్ అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.  Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్   Also read : Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడా ? Also read : Chitra's suicide: చిత్ర ఆత్మహత్యకు కారణం ఏంటి ?