Sowmya Rao Controversy Comments: సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని.. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది సౌమ్య రావు. యాంకర్‌గా అనసూయ తప్పుకోవడంతో ఊహించని విధంగా సౌమ్య రావుకు అవకాశం దక్కింది. అయితే షోకు అనుకున్నంత రేటింగ్స్ రాకపోవడంతో ఆమెను తప్పించి.. సిరి హన్ముంత్‌ను తీసుకువచ్చారు. అయినా షోకు ఆదరణ లేకపోవడంతో రెండు షోలను తీసేసి.. ఒకటే పెట్టారు. యాంకర్‌గా రష్మీ కొనసాగుతోంది. ఇక రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీస్తున్నాయి.
సౌమ్య రావు జబర్దస్త్‌కు దూరమైనా.. అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపిస్తోంది. రీసెంట్‌గా సొంత ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటుంది.
కేజీఎఫ్, కాంతారావు సినిమాల తర్వాత కన్నడలో వచ్చిన పెద్ద సినిమా ఏది..? అని.. కన్నడ సినిమాకు భవిష్యత్ లేదని ఆమె చెప్పడం కాంట్రవర్సీకి దారి తీస్తోంది.
కన్నడ అంటే తనకు అభిమానం అని.. కానీ కన్నడ ఇండస్ట్రీ అంటే పెద్దగా ఇష్టం ఉండదని పేర్కొంది. తాను కన్నడ ఆర్టిస్టులను నిందించడం లేదని.. కన్నడ ఇండస్ట్రీ ఎలా ఉందో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపింది.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీపై పొగడ్తల వర్షం కురిపించింది. తెలుగు ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇక్కడ అందరికీ స్వాగతం పలుకుతారని చెప్పుకొచ్చింది.
సొంత ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించడంతో ఈ భామపై కన్నడ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సౌమ్య రావుకు మళ్లీ కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఉంటుందో లేదో అని నెటిజన్లు వినిపిస్తున్నాయి.