IPl Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తారల సందడి..

IPl Final: నిన్న ఆదివారం సాయంత్రం చైన్నె వేదికగా జరిగిన IPL ఫైనల్ మ్యాచ్ వార్ వన్ సైడ్‌ అన్నట్టుగా సాగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. పదో ఓవర్లో 8 వికెట్ల తేడాతో కప్ ఎగరేసుకుపోయారు. ఈ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్ పలువురు తారలు సందడి చేశారు.

1 /6

ఆదివారం సాయంత్రం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైడ్ రైడర్స్ మూడోసారి కప్ గెలిచారు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు.

2 /6

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ముందు నుంచి పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచారు.

3 /6

చెన్నై వేదికగా జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి కప్‌ను కైవసం చేసుకుంది.

4 /6

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో వెంకటేష్ 52 పరుగులతో అజేయంగా నిలిచారు. అటు రహమనుల్లా గుర్జాబ్ 39 పరుగులు చేయడంతో కోల్‌కతా ఈ మ్యాచ్‌లో సునాసయంగా నెగ్గింది.

5 /6

ఈ మ్యాచ్‌లో జాన్వీ కపూర్.. రాజ్ కుమార్ రావుతో కలిసి సందడి చేసింది. అటు సినీ హీరో వెంకటేష్‌ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

6 /6

అనన్య పాండే మ్యాచ్ మొత్తంగా తెగ ఎంజాయ్ చేసింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ యేడాది ఐపీఎల్ క్రికెట్ సందడి ముగిసింది.