IPL 2023 Records: కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టిన డేవిడ్ వార్నర్.. IPLలో అత్యధిక పరుగుల వీరులు వీళ్లే

IPL TOP Five Batsman: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌పుల్‌ ప్లేయర్లు లిస్ట్‌లో కచ్చితంగా డేవిడ్ వార్నర్ పేరు ఉంటుంది. సర్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించిన వార్నర్.. గతేడాది నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది రిషబ్ పంత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ జట్టు ఓటమిపాలైంది. అయినా డేవిడ్ వార్నర్ మాత్రం ఓ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేయండి. 

  • Apr 09, 2023, 13:31 PM IST


 

1 /5

ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. మొత్తం 225 మ్యాచ్‌లలో 36.55 సగటుతో 6727 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.    

2 /5

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న శిఖర్ ధావన్.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండోస్థానంలో ఉన్నాడు. 208 మ్యాచ్‌లలో 6370 పరుగులు చేశాడు.  

3 /5

ఈ రేసులో డేవిడ్ వార్నర్ మూడోస్థానంలో నిలిచాడు. 165 మ్యాచ్‌ల్లో 42.33 సగటుతో 6012 పరుగులు చేసిన ఏకైక విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఆరు వేల పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీ 188, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. వార్నర్ 165 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.  

4 /5

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్‌ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 228 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5880 రన్స్ చేశాడు.   

5 /5

మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన మాజీ ప్లేయర్ సురేశ్ రైనా.. ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు. రైనా మొత్తం 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు.