Candyologists: క్యాండీ అంటే ఇష్టమా, అయితే క్యాండీ తినే ఉద్యోగం మీ కోసం, ఎలాగో తెలుసా

  • Jan 23, 2021, 21:02 PM IST

 

Candyologists: క్యాండీ ఫన్‌హౌస్ వెబ్‌సైట్‌లో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. మీకిష్టమైన క్యాండీని తినడమే మీ ఉద్యోగం. దీనికోసం కంపెనీ మీకు లక్షల్లో వేతనం కూడా చెల్లిస్తుంది. ఆ ఉద్యోగం మీకు కావాలనుకుంటే..ఫిబ్రవరి 15 గడువు తేదీ.

1 /5

క్యాండీ ఫన్‌హౌస్ తన వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగం గురించి ప్రకటన ఇచ్చింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంపెనీ వెబ్‌సైట్ క్లిక్ చేసి..లక్షల జీతం లభించే ఉద్యోగం కోసం అప్లై చేయండి

2 /5

ముఖ్యమైన విషయం ఏంటంటే..క్యాండీ ఫన్‌హౌస్ మీకు ఇంట్లో కూర్చునే పని చేసే అవకాశమిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ప్రొడక్ట్ టేస్ట్ చేయడమే. టేస్ట్ చేసి..ఆ క్యాండీలో ఏది బాగుంది..ఏం బాగాలేదో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఇంకెలాంటి ఫ్లేవర్ వినియోగించాలా చెప్పాల్సి ఉంటుంది. 

3 /5

ప్రతి గంటకు 47 డాలర్లు చెల్లిస్తామని కెనడా కంపెనీ ప్రకటించింది. ఈ లెక్కన మీరు రోజుకు 8 గంటలు పని చేసినా సరే..రోజుకు 376 డాలర్లు అంటే 27 వేల 447 రూపాయలు సంపాదించవచ్చు. నెలకు 8 లక్షల 23 వేల 410 రూపాయలవుతుంది. 

4 /5

ఆ కంపెనీ పేరు క్యాండీ ఫన్‌హౌస్. కెనడా దేశంలోని ఓంటారియో రాష్ట్రంలో ఉన్న సినిసావుగా నగరంలో ఉంది. ఈ కంపెనీకు ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్  ఆధారంగా క్యాండియోలాజిస్ట్ అవసరముంది.  కంపెనీ తయారు చేసే క్యాండీల టేస్ట్ చూసి..ప్రపంచానికి చెప్పడమే.

5 /5

మీకు క్యాంటీ తినడం బాగా ఇష్టమా..అయితే ఈ ఉద్యోగం మీ కోసమే. వివిధ రకాల క్యాండీలు టేస్ట్ చేసి విశ్లేషించే సామర్ధ్యముందా..అయితే లక్షల్లో జీతం లభించే ఉద్యోగముంది. అవును నిజమే..ఓ కంపెనీ...క్యాండీ టేస్ట్ చేసి విశ్లేషించే సామర్ధ్యమున్న వ్యక్తి కోసం అణ్వేషిస్తోంది. దీనికి భారీ జీతమే ఇస్తుందట. ప్రపంచంలోని ఏ మూలన ఉండైనా ఉద్యోగం చేయవచ్చు.