Independence Day 2024: ఇండిగో ఫ్రీడం సేల్‌ మతిపోయే బంపర్‌ ఆఫర్స్‌.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశీ- విదేశీ ప్రయాణీకులకు బెస్ట్‌ ఆప్షన్స్‌..

Independence Day 2024 Indigo Sale Offer: భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండిగో ఫ్రీడం సేల్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఇండిగో అధికారికంగా ఎక్స్‌లో ఈ ఆఫర్‌ వివరాలను ప్రకటించింది. ఇందులో ఆకర్షణీయమైన ఆఫర్లను తమ ప్రయాణీకుల కోసం ప్రకటించింది. ఇది దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు వర్తిస్తుంది. ఆరోజు రేపు రెండు రోజులపాటు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
 

1 /5

ఇండిగో ఫ్రీడం సేల్‌ ప్రయాణీకులకు ఈ ప్రత్యేక ఆఫర్‌తోపాటు ఇతర సర్వీసులను కూడా అదనంగా అందిస్తుంది. స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ రూ.1,015 టక్కెట్‌ ఆఫర్ ప్రకటించింది. మీ కుటుంబ సభ్యులతో టూర్‌ ప్లాన్‌ చేస్తున్న వారికి ఇది సదావకాశం. మీర స్నేహితులతో కూడా ఎక్కడైనా వెకేషన్‌కు కూడా వెళ్లవచ్చు. అంతర్జాతీయ ప్రయాణానికి టిక్కెట్టు ధరలను రూ. 3,715 నుంచి బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  

2 /5

అంతేకాదు ఫ్రీడం సేల్‌ ఆఫర్‌లో భాగంగా ఇండిగో ఇవి కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా ప్రకటించింది. సెలక్టెడ్‌ 6E యాడ్‌ ఆన్స్‌ పై ఫ్లాట్‌ 15 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. యాడ్‌ ఆన్ సర్వీసులో సీట్‌ సెలక్షన్‌, ఎక్సెస్‌ బ్యాగేజీ, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌, స్పోర్ట్స్‌ ఎక్విప్మెంట్‌ కూడా ఇందులో భాగం.  

3 /5

అయితే, ఈ బుకింగ్‌ 2024 ఆగష్టు 15, 23: 59 సమయం వరకు బుక్‌  చేసుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. ఈరోజుల్లో బుక్‌ చేసుకున్న టిక్కెట్లపై 2024 ఆగష్టు 22 నుంచి 2025 మార్చి 31 వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ మధ్య రోజుల్లో ప్రయాణీకులు వారికి కావాల్సిన తేదీని ఎంపిక చేసుకోవచ్చు  అంటే చలికాలం, ఎండకాలం రెండూ సీజన్‌లు కూడా కవర్‌ అవుతాయి.  

4 /5

ఈ ఫ్రీడం సేల్‌ ఆఫర్లో అదనపు ఛార్జీలు, ఫీజు కూడా యథావిధిగా కొనసాగుతాయి. బుక్‌ చేసుకునే ముందు ప్రయాణీకులు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ఆఫర్‌ బుక్‌ చేసుకోవడానికి ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ (goindigo.in) లేదా ఇండిగో మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. కానీ థర్డ్‌ పార్టీ బుకింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌ లేదా ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా బుక్‌ చేసుకునేవారికి ఆఫర్ వర్తించదు.  

5 /5

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడం సేల్‌ ఆఫర్ ను ఏయిర్‌లైన్‌ విస్తారా కూడా ఇండిపెన్‌డెన్స్‌ డే ఆఫర్ ఆగష్టు 12 వ తేదీ నుంచి ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ప్రత్యేక సర్వీసులు విమాన సంస్థలు ప్రకటిస్తున్నాయి.