India Future Space Missions: ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని బాథ్యతలు చేపట్టారు. మోదీ 3.0లో అంతరిక్షంపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోదీ 2.0 హయాంలో చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఇప్పుడిక మోదీ 3.0 కాలంలో అంటే రానున్న ఐదేళ్లలో ఇండియా 5 మేజర్ అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
శుక్రయాన్ మిషన్ 1 వచ్చే ఏడాది శుక్రుడినిపై అధ్యయనం కోసం శుక్రయాన్ 1 ప్రాజెక్టు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇదొక ఆర్బిటర్. శుక్రుని చుట్టూ తిరుగుతూ వాయుమండలం, అంతరిక్షం సమాచారం సేకరిస్తుంది.
NISAR Mission అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, భారత స్పేస్ ఏజెన్సీ ఇస్రో కలిసి ఈ ఏడాది నిసార్ మిషన్ లాంచ్ చేయనున్నాయి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ సహాయంతో ఈ మిషన్ భూమిపై పరిస్థితులు, మంచు పరిస్తితి , ప్రకృతి విపత్తులను అధ్యయనం చేస్తుంది. జలవాయు మార్పుల్ని అర్ధం చేసుకుని సూచనలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది.
చంద్రయాన్ 4 మిషన్ చంద్రయాన్ 3 విజయవంతం తరువాత అంతరిక్షంలో భారత్ పేరు మార్మోగిపోయింది. 2028లో చంద్రయాన్ 4 చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఇస్రో ఈ మిషన్ ద్వారా చంద్రుని నుంచి శాంపిల్ తీసుకురావచ్చు. అంటే చంద్రయాన్ 4 కేవలం చంద్రునిపై అడుగుపెట్టడమే కాకుండా అక్కడ్నించి శాంపిల్ సేకరించి వాటిని విశ్లేషించి ఆ డేటాను భూమికి పంపిస్తుంది.
మంగళయాన్ 2 మిషన్ మంగళయాన్ 1 సక్సెస్ తరువాత 2026లో ఇస్రో మంగళయాన్ 2 చేపట్టనుంది. మంగళగ్రహం గురించి సమాచారం తెలియనుంది. ఈ మి,న్ ఉద్దేశ్యం మంగళ గ్రహం కక్ష్య, వాయు మండలం గురించి సమాచారం తెలుసుకోవడం.
నాసా ఆర్టిమిస్ మిషన్ నాసా ఆర్టిమిస్ మిషన్లో ఇండియా భాగస్వామ్యం కానుంది. ఈ మిషన్ ద్వారా మనిషి రెండోసారి చంద్రునిపై పంపించే ఏర్పాట్లు చేస్తోంది.