Immunity power: రోగ నిరోధక శక్తి అవసరమేంటనేది కరోనా కారణంగా ప్రతి ఒక్కరికీ బాగా తెలుస్తోంది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడమే తక్షణ పరిష్కారమార్గంగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు సరే..మీకు ఆ అలవాట్లుంటే మాత్రం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి..
కాఫీ, టీలో కెఫిన్ ఉంటుందని అందరికీ తెలుసు. కెఫిన్ మెదడును ఉత్తేజం చేయడానికి ఉపయోగపడుతుంది. నిద్ర రాకుండా ఉండేందుకు చాలామంది టీ సేవిస్తుంటారు. అయితే వేళ కాని వేళల్లో టీ, కాఫీలు తీసుకుంటే..కడుపులో మంట, రోగ నిరోధక శక్తి తగ్గడం జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
స్వీట్ ఇష్టపడని వారుండరు. నిత్య జీవితంలో ఏదో సందర్భంలో తీపి పదార్ధాలు తింటుంటారు. మోతాదుకు మించి తీపి పదార్ధాల్ని తీసుకోవడం వల్ల..డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే..రోగ నిరోధక కణాల పని సామర్ధ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీకి దూరంగా ఉండండి..
చాలామంది రుచికి సరిపడేంత ఉప్పు లేదంటూ..ఆహారంలో ఉప్పు అధికంగా వాడేస్తుంటారు. దీనివల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి బలహీన పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అధిక ఉప్పు వల్ల..శరీరంలో సోడియంను మూత్రపిండాలు వడపోసే సమయంలో డొమిన్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. దాంతో శరీరం.. బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని, ఇమ్యూనిటీ తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు.
ప్రతి రోజూ మద్యం సేవించే వారికి కాలేయ సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి..మొదట న్యుమోనియా తరువాత శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత మేరకు మద్యం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.