Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?

Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్స్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం. 

1 /7

బాలీవుడ్ లో..   2024లో అత్యధిక పారితోషికం పొందిన భారతీయ నటీమణుల జాబితాలో.. దీపికా పదుకొణె , పఠాన్ నటుడు షారుఖ్ ఖాన్ లు ఒక్కో సినిమాకు రూ. 15-30 కోట్ల రేంజ్‌లో వసూలు చేస్తున్నారు. దీపికా పదుకొనే నికర విలువ దాదాపు రూ. 500 కోట్లకు చేరుకుంది. 

2 /7

బీజేపీ ఫైర్ బ్రాండ్ రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఇటీవల మండి నుంచి ఎంపీగా గెలుపొందారు. కంగనా రనౌత్ ఒక సినిమాకి రూ. 15 - 27 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం.  ఆమె నికర విలువ దాదాపు రూ. 91 కోట్లు.

3 /7

ఇక మూడో స్థానం లో.. ప్రియాంక చోప్రా ఉన్నారు. పీసీ రూ. 620 కోట్ల నికర విలువతో జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.  ప్రియాంక మాత్రం 15-25 కోట్లు సంపాదిస్తోంది.

4 /7

నాలుగో ప్లేస్ లో కత్రినా కైఫ్ ఉన్నారు. ఆమె ఒక సినిమాకు గాను..రూ. 15 -25 కోట్లు వసూలు చేస్తూన్నారు. ఆమె రూ. 224 కోట్ల నికర విలువను కల్గి ఉన్నారు. 

5 /7

ఆ తర్వాత అలియా భట్ ఉన్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో అలియా ఒకరు. డార్లింగ్స్, గంగూబాయి కతియావాడి, హార్ట్ ఆఫ్ స్టోన్,  ఇతర చిత్రాల మెగా సక్సెస్ తర్వాత అలియా దూసుకుపోతోంది. అలియా భట్ ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 20 కోట్లు వసూలు చేస్తుందని, ఆమె నికర విలువ రూ.550 కోట్లు ఉంటుందని సమాచారం.  

6 /7

కరీనా కపూర్ ఖాన్: బెబో ఒక సినిమాకి 8-18 కోట్లు తీసుకుంటుంది. ఆమె తర్వాత ది బకింగ్‌హామ్ మర్డర్ ,  సింఘమ్ ఎగైన్ వంటి సినిమాల్లో కనిపించనుంది. 

7 /7

శ్రద్ధా కపూర్: స్ట్రీ 2లో మళ్లీ వస్తున్న శ్రద్ధా ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల నుంచి రూ. 15 కోట్లు తీసుకుంటుంది. ఆమె తర్వాత విద్యాబాలన్: విద్యా జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.  ఒక్కో చిత్రానికి రూ. 8 - 14 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.